రౌడీ గర్ల్ ఫ్రెండ్‌కు ఎడిటర్‌గా మారిన షారుఖ్ కూతురు

అనన్యా పాండే... మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుణ్యమాని ప్రస్తుతం ఈ అమ్మాయి పేరు టాలీవుడ్ వారికీ సుపరిచితమైంది. డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్.. పాన్ ఇండియా రేంజ్ లో తీస్తున్న కొత్త సినిమాలో ఈ చిన్నదే హీరోయిన్. చుంకీ పాండే గారాలపట్టి అయిన అనన్య... ఇప్పటికే బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఉంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే... ఇంతకూ విషయం ఏమిటంటే... బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్... అనన్యకు ఎడిటర్ గా మారిందట. అదీ తాజా ముచ్చట....

అదేంటి... షారుఖ్ ఖాన్ కూతురు... తండ్రి బాటలో హీరోయిన్ అయిపోతుంది... సిల్వర్ స్క్రీన్ ను ఏలేస్తుంది అనుకుంటే... అమ్మాయి... తెరవెనుక కత్తెర పట్టుకుందేంటబ్బా అనుకుంటున్నారా...! అయితే సుహానా ఎడిటర్ అవతారమెత్తింది కేవలం అనన్య కోసం మాత్రమే... కాబట్టి, ఆమె బాలీవుడ్ కలలకు ప్రస్తుతానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు.

ఇక పోతే అసలు విషయం ఏమిటంటే....అనన్యా, సుహానా మంచి స్నేహితులు. లాక్ డౌన్ నేపథ్యంలో... అసలు కలుసుకోవడం కుదరడంలేదేమో... అమ్మాయిలిద్దరూ ఒకరినొకరు చాలా మిస్ అయిపోతున్నారట. ఇక ఈ సందర్భంలోనే... సుహానా.... అనన్యకు ఏ స్వీట్ సప్రైజ్ ఇచ్చింది.

Shah Rukh Khan daughter Suhana Khan turns Editor for Ananya Pandey

అనన్య... ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏడాది పూర్తైన సందర్భంగా... సుహానా ఆమె కోసం ఓ చిన్న వీడియోను రూపొందించింది. అనన్య మోడిలింగ్ ఫోటో షూట్ ల్లోని తెరవెనుక దృశ్యాలను ఒక్కచోటుకి చేర్చి... చక్కని వీడియోగా రూపొందించి అనన్యతో షేర్ చేసుకుంది. ఇక ఈ వీడియోను చూసుకుని ఉబ్బితబ్బిబైపోయిన అనన్య... ఆ రెండు నిమిషాల చిత్రాన్ని తన ఇన్స్టా స్టేటస్ గా పెట్టుకుంది. తన స్నేహితురాలే స్వయంగా ఈ విడియోను ఎడిట్ చేసిందని ఓ కామెంట్ కూడా ట్యాగ్ చేసింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరోవైపు... అనన్య పూరీ- విజయ్ మూవీతో పాటూ, ఇషాన్ కట్టర్ హీరోగా నటిస్తున్న కాలీ పీలీ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ రెండు సినిమాలూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X