Don't Miss!
- Finance
LIC: రెండు రోజుల్లో రూ.16,580 కోట్లు నష్టపోయిన ఎల్ఐసీ.. ఆందోళనలో పెట్టుబడిదారులు..!
- News
భర్తతో గొడవ: కొరికేసింది.. సీన్ కట్ చూస్తే..!
- Sports
INDvsNZ : ఇదేం బౌలింగ్రా.. నువ్వే వాళ్లను గెలిపిస్తున్నావ్.. టీమిండియా పేసర్‌పై ట్రోల్స్!
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
- Technology
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- Automobiles
కొత్త సంవత్సరంలో కూడా తగ్గని ధరల మోత: XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..
- Lifestyle
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
Pathaan నుంచి మరో రొమాంటిక్ సాంగ్.. దీపిక పదుకోన్ డోస్ ఏ రేంజ్‌లో ఉందంటే?
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన పటాన్ సినిమా 2023 జనవరి 25వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. వార్ దర్శకుడు ఆనంద్ సిద్ధార్థ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెండవ పాటను కూడా విడుదల చేశారు. ఇది వరకే విడుదలైన బేశరం రంగ్ పాట ఏ స్థాయిలో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అందులో దీపిక పదుకొను ఘాటైన బికినీ అందాలతో రెచ్చిపోవడంతో కొన్ని కాంట్రవర్సీలను కూడా క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు రెండవ పాట జూమే జో పాటలో మాత్రం ఆ స్థాయిలో రెచ్చిపోకపోయిన కూడా అక్కడక్కడ మాత్రం గ్లామర్ ట్రీట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే షారుక్ దీపికా రెండో సారి కూడా మళ్లీ ఎప్పటిలానే రొమాంటిక్ పాటతో కొంత బోరింగ్ కొట్టించారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

ఈ పాటలో మంచి బీట్ ఉన్నప్పటికీ కూడా అంత కొత్తగా ఏమీ లేదు అని బేషరం పాట మాత్రమే బాగుందని కూడా మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విశాల్ శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక బేషరం సాంగ్ కాంట్రవర్సీ క్రియేట్ చేయడంతో సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ అయితే వచ్చింది.
తప్పకుండా పఠాన్ సినిమాతో షారుక్ ఖాన్ ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే చాలా కాలంగా షారుఖాన్ సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. చివరగా నాలుగేళ్ళ క్రితం చేసిన జీరో సినిమా దారుణంగా దెబ్బ కొట్టింది. అందుకే ఈ సినిమాతో అతను ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో మరో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా హైలెట్ కాబోతున్నాయి. మరి పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన మరో టీజర్ కూడా విడుదల చేయబోతున్నారు.