twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డ్రగ్స్ కేసులో కోర్టుకు వెళ్లిన ఆర్యన్ ఖాన్.. క్లీన్‌చిట్ తర్వాత ఏం జరిగిందంటే?

    |

    బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై నుంచి గోవా వెళ్లే కార్డేలియా క్రూయిజ్‌లో డ్రగ్స్‌ కేసులో పట్టుబడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో ఆర్యన్ కొద్ది రోజులు జైలులో రిమాండ్‌లో ఉండటం, ఆ తర్వాత అక్టోబర్ 28వ తేదీన బెయిల్‌పై విడుదల కావడం తెలిసిందే. ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌తోపాటు 14 మందిపై మే 27 తేదీన 6 వేల పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది.

    డ్రగ్స్ కేసును విచారించిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ 1985 కోర్టు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చీట్ ఇచ్చింది. అయితే ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇవ్వడంపై అభ్యంతరాలు ఉంటే.. రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోను ఆదేశించింది. ఈ కేసు విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేసింది. అయితే బెయిల్ సమయంలో కోర్టుకు అప్పగించిన పాస్‌పోర్టు, బెయిల్ బాండ్లను తిరిగి ఇవ్వాలని ఆర్యన్ ఖాన్ కోర్టును ఆశ్రయించారు.

    Shah Rukh Khans son Aryan Khan plea to NDPS Court to return passport

    ఎన్సీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఆర్యన్ ఖాన్‌ పేరు దాఖలు చేయలేదు. ఆర్యన్ ఖాన్‌తో పాటు ఐదుగురిని ఈ కేసు నుంచి మినహాయించారు. ఈ ఐదుగురి వద్ద డ్రగ్స్ ఉన్నట్టు సాక్ష్యాలు లభించలేదు. చట్టవ్యతిరేకంగా డ్రగ్స్ ఉంచుకొన్నట్టు ఆధారాలు లభ్యం కాలేదు. సరైన దర్యాప్తు చేసిన ఎన్సీబీ సిట్ అధినేత సంజయ్ కుమార్ ఆధారాలు లేకపోవడంతో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు. అందుకు ధన్యవాదాలు తెలియజేసుకంటున్నాం అని ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది సతీష్ మాన్‌షిండే తెలిపారు.

    క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీలో ఆర్యన్ ఖాన్, మరో ఐదుగురు వద్ద ఏమీ లభించకపోవడం, సరైనా ఆధారాలు వారి వద్ద లేకపోవడం వల్ల ఎన్సీబీ పిటిషన్ దాఖలు చేయలేదు. ఈ కేసులో మరో 14 మందిపై ఎన్సీబీ చార్జిషీట్ దాఖలు చేసింది అని తెలిపారు.

    అక్టోబర్ 2వ తేది, 2021లో గోవాకు సమీపంలోని సముద్ర మధ్యలో ఆర్యన్ ఖాన్‌తోపాటు ఐదుగురిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకొన్నది.

    English summary
    Bollywood superstar Shah Rukh Khans son Aryan Khan files a plea to NDPS Court to return passport and bail bonds after clean chit in drugs case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X