»   » బాలీవుడ్‌లోకి మరో సినీ ప్రముఖుడి కూతురు.. తండ్రికి షాకిచ్చి సినిమాలోకి ఎంట్రీ..

బాలీవుడ్‌లోకి మరో సినీ ప్రముఖుడి కూతురు.. తండ్రికి షాకిచ్చి సినిమాలోకి ఎంట్రీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లోకి వారసుల పిల్లలు వేగంగా దూసుకొస్తున్నారు. ఇప్పటికే సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తదితరులు నటరంగ ప్రవేశం చేసేశారు. ఇప్పుడిక ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు శేఖర్ కపూర్ వంతు వచ్చేసింది. త్వరలోనే శేఖర్ కపూర్ కూతురు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నది. కానీ తండ్రి ఓ షరతు విధించి మీర తెర మీదకు వస్తున్నది. ఈ షరతు ఏమిటంటే..

శేఖర్ కపూర్‌కు షరతుపెట్టి..

తాజాగా శేఖర్ కపూర్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. కావేరి నీకు ఇష్టం ఉంటే సినిమాల్లో నటించమని నేను అడిగాను. నటిస్తాను. కానీ నాదో ఓ షరతు అని ఆమె చెప్పింది. అయితే నాకు మ్యూజిక్ డైరెక్షన్ చేసే అవకాశమిస్తేనే నీవు తీసే సినిమాలో నటిస్తా అని నన్ను కోరింది. కాన్ఫిడెన్స్ అంటే అలా ఉండాలి అని శేఖర్ కపూర్ ట్వీట్ చేశాడు.

సంగీత సామ్రాజ్యంలో

సంగీత సామ్రాజ్యంలో

ప్రస్తుతం కావేరి ప్రపంచ మ్యూజిక్ రంగంలో సత్తా చాటుతున్నది. తన తల్లి సుచిత్ర కృష్ణమూర్తి నుంచి సంగీత కళ ఆమెకు అబ్బింది. తన తల్లి వారసత్వాన్ని కావేరి అలా కొనసాగిస్తున్నది.

 11 ఏళ్ల వయసులోనే

11 ఏళ్ల వయసులోనే

కావేరి తన 11 ఏళ్ల వయసులోనే డిడ్ యూ నో అనే తొలి పాటకు సాహిత్యాన్ని అందించడమే కాదు సంగీతాన్ని కూడా సమకూర్చింది. ఆమె స్వరపరిచిన హాఫ్ ఏ హార్ట్ అనే పాటకు అమితాబ్ బచ్చన్ ఫిదా అయిపోయి అభిమానిగా మారిపోయారు. ఆమె టాలెంట్‌ను, పరిణతిని ప్రశంసిస్తూ ఆనందపడిపోయారు.

ఏఆర్ రెహ్మన్ గురువుగా

ఏఆర్ రెహ్మన్ గురువుగా

ప్రపంచ సినీ సంగీత దిగ్గజాలు ఏఆర్ రెహ్మాన్, టిమ్ మోలీన్యూజ్ లాంటి గురువుల పర్యవేక్షణలో కావేరి రాటుదేలుతున్నది. త్వరలోనే నాలుగో పాటను ఆమె రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నది. ఇటీవల భారతీయ రాక్‌బాండ్ మాతీ బాణితో కలిసి ఓ ప్రదర్శన కూడా ఇచ్చింది.

English summary
Shekhar Kapur's daughter Kaveri ready to entry into bollywood. The filmmaker took to Twitter to reveal that he asked Kaveri if she would be interested in acting in his film, but her answer left him stunned. "I asked Kaveri if she would act in my film. 'Only if I can compose the music,' she replied firmly. Now that's confidence," Shekhar Kapur tweeted on Thursday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu