For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘ఆ డైరెక్టర్ పురుషాంగం చూపించి.. రేటింగ్ ఇవ్వమన్నాడు.. అలాంటి చీడపురుగు బిగ్‌బాస్‌లోనా?’

  |

  మీటూ ఉద్యమంలో భాగంగా బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌పై శృంగార తార షెర్లీన్ చోప్రా సంచలన ఆరోపణలు చేయడం 2005లో అత్యంత వివాదాస్పదంగా మారాయి. అయితే అలాంటి వ్యక్తి సాజిద్ ఖాన్‌ను బిగ్‌బాస్‌ షోలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వడంపై మరోసారి షెర్లీన్ నిప్పులు చెరిగారు. అతడిపై కేసు, న్యాయవిచారణ జరుగుతుండగా బిగ్‌బాస్ షోలోకి ఎలా తీసుకొంటారని షెర్లీన్ ప్రశ్నిస్తూ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముంబైలో షెర్లీన్ చోప్రా సంచలన విషయాలను బయటపెడుతూ..

  బిగ్‌బాస్ షోలో సాజిద్ ఖాన్

  బిగ్‌బాస్ షోలో సాజిద్ ఖాన్

  బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తాజా సీజన్‌ ఇటీవలే మొదలైంది. ఈ షోలో సాజిద్ ఖాన్‌ను తీసుకోవడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. షారుక్, సల్మాన్ ఖాన్‌కు ఆయన సోదరి ఫరా ఖాన్‌కు ఉన్న సంబంధాల కారణంగానే ఈ షోలో ఆయనకు ప్లేస్ దక్కింది అనే విమర్శలు వినిపించాయి. ఈ షోలో సాజిద్ ఖాన్‌ను తీసుకోవడంపై షెర్లీన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. దారుణమైన విషయంగా పరిగణించింది.

  ఆడిషన్స్ కోసం వెళితే గదిలో..

  ఆడిషన్స్ కోసం వెళితే గదిలో..

  ముంబైలో 2005 సంవత్సరంలో సాజిద్ ఖాన్‌ నుంచి ఎదురైన చేదు ఘటనపై షెర్లీన్ చోప్రా స్పందిస్తూ.. నా కెరీర్ ఆరంభంలో ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నాను. సాజిద్ ఖాన్ నుంచి పిలుపు వస్తే ఆడిషన్స్ కోసం వెళ్లాను. ఆ సమయంలో గదిలో నాతో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తనతో అసభ్యంగా ప్రవర్తించారు అని షెర్లీన్ చోప్రా వివరించింది.

  ఎంత రేటింగ్ ఇస్తావని..

  ఎంత రేటింగ్ ఇస్తావని..

  2005లో జరిగిన చేదు అనుభవాన్ని వివరిస్తూ.. ఆ సమయంలో మా నాన్న మరణించారు. పుట్టెడు దు:ఖంలో ఉన్న తనకు సాజిద్ ఖాన్ నుంచి కాల్ వచ్చింది. స్టోరీ నెరేషన్ గురించి తన ఇంటికి పిలిచాడు. అయితే ఇలా నాపై లైంగికంగా వేధిస్తాడని ఊహించలేదు. కానీ మంచి ఆఫర్ వస్తుందని కొండంత ఆశతో వెళ్లాను. నాకు కథ చెబుతూ మధ్యలో తన పురుషాంగం బయటకు తీసి చూపించాడు. నా పురుషాంగానికి ఎంత రేటింగ్ ఇస్తావని అడుగుతూ వెకిలి నవ్వులు నవ్వాడు అని షెర్లీన్ చెప్పింది.

  నా పురుషాంగాన్ని టచ్ చేస్తావా?

  నా పురుషాంగాన్ని టచ్ చేస్తావా?

  సాజిద్ ఖాన్ నుంచి ఊహించని పరిణామం రావడంతో నేను దిగ్బ్రాంతికి లోనయ్యాను. ఆ షాక్ నుంచి తేరుకోకముందే.. తన పురుషాంగాన్ని చూపిస్తూ.. టచ్ చేయాలని ఉందా? నీకు అలాంటి ఫీలింగ్ ఏదైనా ఉందా? నా అంగానికి ఎంత రేటింగ్ ఇస్తావు? అంటూ దారుణంగా మాట్లాడాడు. గదిలో ఆయన తీరుతో నేను వణికిపోయాను. నా తండ్రి మరణించాడని సంతాపం తెలియజేయకపోగా.. నాపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారు. ఆ సమయంలో నేను ఈ బాధను చెప్పుకోవాలో తెలియలేదు అని షెర్లీన్ అన్నారు.

  మీటూ సందర్భంగా బయటకు..

  మీటూ సందర్భంగా బయటకు..

  సాజిద్ ఖాన్ నిర్వాకాన్ని ఆయన సోదరి ఫరా ఖాన్‌కు చెప్పాలా? వద్దా అనే ఊగిసలాడాను. ఆమెకు షారుక్ ఖాన్‌కు మంచి రిలేషన్ ఉందనే విషయం తెలుసు. మహిళలంటే షారుక్‌కు చాలా అభిమానం ఉంది. అలాంటి ఫ్యామిలీ నుంచి సాజిద్‌ను చూసి కంపరం వేసింది. అందుకే మీటూ ఉద్యమం సందర్భంగా సాజిద్ ఖాన్ వ్యవహారాన్ని బయటపెట్టాను అని షెర్లీన్ చెప్పారు.

   బిగ్‌బాస్‌కు లీగల్ నోటీసులు

  బిగ్‌బాస్‌కు లీగల్ నోటీసులు

  సాజిద్ ఖాన్‌పై పెట్టిన కేసు ఇంకా కొనసాగుతున్నది. ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాజిద్ ఖాన్‌ను బిగ్‌బాస్‌లోకి ఎలా తీసుకొంటారు. ఈ విషయంపై నా లీగల్ టీమ్‌తో సంప్రదింపులు జరుపుతున్నాను. త్వరలోనే బిగ్‌బాస్ నిర్వాహకులకు నోటీసులు ఇస్తాం. సాజిద్ ఖాన్ లాంటి వ్యక్తి వల్ల మరో మహిళ వేధింపులకు గురికాకుండా చేయడమే నా పోరాటం అని షెర్లీన్ చోప్రా అన్నారు.

  English summary
  Bollywood Actress Sherlyn Chopra questions Salman Khan's Bigg Boss Organisers over Sajid Khan entry into show. She is planning to send legal notice over addition of Sajid Khan in Bigg Boss
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X