Raj Kundra Arrest , శిల్పా శెట్టి అదృశ్యం... మీడియాకు ముఖం చాటేసిన బ్యూటీ

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ సోమవారం రాత్రి అరెస్టు చేసింది. అతను అశ్లీల చిత్రాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజ్ కుంద్రా నేరం చేసినట్టు తమ వద్ద తగిన ఆధారాలున్నాయని ముంబై పోలీసులు చెప్పారు. ఈ కేసులో రాజ్ కుంద్రాను జూలై 23 వరకు పోలీసు కస్టడీకి పంపారు. అయితే ఇంత జరుగుతున్నా శిల్పా శెట్టి ఎక్కడ ఉన్నారు ? అనే వివరాల్లోకి వెళితే..

Recommended Video

Shilpa Shetty skips her shooting as raj kundra got arrested | Oneindia Telugu
 విచారణకు పిలిచి

విచారణకు పిలిచి

ఫిబ్రవరిలో నమోదయిన అశ్లీల చిత్రాల కేసుకు సంబంధించి రాజ్ కుంద్రా సోమవారం రాత్రి 9 గంటలకు ప్రశ్నించడం కోసం ముంబై బైకుల్లాలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి చేరుకున్నారు. దీని తరువాత, సోమవారం రాత్రి 11:00 గంటల సమయంలో 2 గంటల విచారణ తర్వాత రాజ్ కుంద్రాను క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్టు చేశారు. రాజ్ కుంద్రా తరువాత, ర్యాన్ జాన్ అనే మరో వ్యక్తిని నవీ ముంబైలో అరెస్టు చేశారు.

RajKundra కొంప ముంచిన మెంటల్ టార్చర్.. తెలివిగా అగ్రిమెంట్లు చేసి ఇలా దొరికేశారు!

తీవ్రమైన ఆరోపణలు

తీవ్రమైన ఆరోపణలు

శిల్పా భర్త రాజ్ కుంద్రా మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అతను అశ్లీల సినిమాలు చేసి, వాటిని ఒటిటి ప్లాట్‌ఫాంపై విడుదల చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రతి వారం ఒక చిత్రం విడుదలవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో రాజ్‌తో పాటు ఇప్పటికే మరో 5 మందిని అరెస్టు చేశారు. ఈ విషయంలో 2021 ఫిబ్రవరిలో కేసు నమోదైంది. రాజ్ యొక్క వాట్సాప్ చాట్ కూడా బయటపడింది. ఈ గ్రూప్ ద్వారా రాజ్ వ్యాపారం గురించి మాట్లాడుకునేవారు.

ఆ షోకి జడ్జ్ గా

ఆ షోకి జడ్జ్ గా

ఇక ప్రస్తుతానికి బాలీవుడ్ నటి, ఫిట్‌నెస్ ఫ్రీక్ శిల్పా శెట్టి సూపర్ డాన్సర్ 4 అనే రియాలిటీ షోలో పాల్గొంటున్నారు. ఆ షోలో ఆమె జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ అశ్లీల చిత్రాల యాప్ కేసులో భర్త రాజ్‌ను అరెస్టు చేసిన తరువాత, ఈ షో షూటింగ్ కోసం శిల్ప రాలేదని వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం మేరకు శిల్పాకు మంగళవారం షో షూటింగ్ షెడ్యూల్ ఉంది,

జుహులోని ఒక బంగ్లాలో

జుహులోని ఒక బంగ్లాలో

కానీ ఆమె భర్త అరెస్ట్ నేపథ్యంలో షూట్ కోసం వెళ్ళలేదు. సోమవారం రాత్రి ఆమె భర్త రాజ్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసిన వెంటనే ఆమె తన సోదరి వద్దకు వెళ్లిందని అంటున్నారు. ఆమె ప్రస్తుతం తన సోదరి షమిత మరియు తల్లితో కలిసి జుహులోని ఒక బంగ్లాలో ఉందని అంటున్నారు.

రీ ఎంట్రీ

రీ ఎంట్రీ

ఇక శిల్ప సినిమాల విషయానికి వస్తే ఆమె సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దం అవుతోంది. శిల్ప హంగామా 2 సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రంలో పరేష్ రావల్ మరియు మీజాన్ జాఫ్రీ కూడా నటించారు. ఈ సినిమా నుంచి ఒక పాట కూడా విడుదలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X