For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Raj Kundra అరెస్ట్ ముందే తెలుసా.. శిల్పాశెట్టి సోషల్ మీడియా పోస్ట్‌కు అర్ధం అదేనా?

  |

  అశ్లీల చిత్రాలను తయారు చేసి అమ్ముతూ వ్యాపారం చేసిన కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను సోమవారం అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్ట్ తరువాత ఆయన భార్య శిల్పా శెట్టి మిస్సింగ్ లో ఉన్నారు. ఆమె నుంచి దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో రాజ్ కుంద్రా అరెస్ట్ కు ముందు ఒక పోస్ట్ పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే

  ప్రధాన కుట్రదారుడిగా

  ప్రధాన కుట్రదారుడిగా

  సోమవారం రాత్రి రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన తరువాత, ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రాలే ఒక ప్రకటనలో 2021 ఫిబ్రవరిలో ముంబైలోని క్రైమ్ బ్రాంచ్‌లో అశ్లీల చిత్రాల ఉత్పత్తికి, కొన్ని యాప్‌ల ద్వారా వాటిని ప్రచురించడానికి సంబంధించి కేసు నమోదైందని చెప్పారు. ఈ కేసులో 19/7/21 న రాజ్ కుంద్ర ప్రధాన కుట్రదారుడిగా ఉన్నందున మేము అతన్ని అరెస్ట్ చేశామని అన్నారు.

  మన చుట్టూ ఏమి జరుగుతుందో

  మన చుట్టూ ఏమి జరుగుతుందో

  అయితే ఇప్పుడు ఈ కేసు నేపధ్యంలోనే శిల్పా శెట్టి కుంద్రా భర్త అరెస్టుకు ముందు చేసిన చివరి సోషల్ మీడియా పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పోస్ట్ యొక్క శీర్షిక కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. శిల్పా శెట్టి ఇలా వ్రాశారు, 'మన చుట్టూ ఏమి జరుగుతుందో మార్చగల శక్తి మాకు ఎప్పుడూ ఉండకపోవచ్చు, కాని మనలో ఏమి జరుగుతుందో ఖచ్చితంగా నియంత్రించవచ్చని ఆమె పేర్కొన్నారు.

  అరెస్ట్ ముందే తెలుసా ?

  అరెస్ట్ ముందే తెలుసా ?

  ఇది యోగా ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్న్నారు. ఈ యోగా ద్వారా మన మనస్సును శాంతపరచుకునే సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు, అవాంఛిత ఆలోచనలను తగ్గించవచ్చు, మన మనస్సు ఎక్కడెక్కడో సంచరించకుండ ధ్యానం రూపంలో కేంద్రీకరించవచ్చని పేర్కొన్నారు. అయితే ఆమెకు రాజ్ అరెస్ట్ ముందే తెలుసా ? అందుకే పరోక్షంగా ఈ పోస్ట్ పెట్టారా ? అనే చర్చ కూడా నడుస్తోంది.

  Raj Kundra పోర్న్ దెబ్బ.. శిల్పా శెట్టికి కొత్త షాక్.. ఆమె స్థానంలో మరో స్టార్ హీరోయిన్?

  ట్రాటాకా ధ్యానం

  ట్రాటాకా ధ్యానం

  ఇక దానికి ట్రాటాకా ధ్యానం అని పేర్కొన్న ఆమె దాని ద్వారా మన దృష్టిని కేంద్రీకరించవచ్చని పేర్కొంది. ఇక ఈ కేసులో శిల్ప శెట్టి యొక్క చురుకైన పాత్రను పోలీసులు ఇంకా కనుగొనలేదని జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) మిలింద్ భరంబే ఇటీవల విలేకరుల సమావేశంలో అన్నారు.

  11 మంది అరెస్టు

  11 మంది అరెస్టు

  మేము దర్యాప్తు చేస్తున్నామన్న ఆయన బాధితులు ముందుకు వచ్చి క్రైమ్ బ్రాంచ్ ముంబైని సంప్రదించాలని మేము విజ్ఞప్తి చేస్తామని, ఈ కేసులో తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక ఈ అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో ప్రమేయం ఉన్నందుకు రాజ్ కుంద్రాతో సహా కనీసం 11 మందిని అరెస్టు చేశారు.

  Raj Kundra మామూలోడు కాదుగా.. ప్రతి దానికి సెపరేట్ టీమ్.. లండన్ అప్లోడ్ స్కెచ్ మాత్రం!

  షాక్ లో శిల్ప శెట్టి

  షాక్ లో శిల్ప శెట్టి

  నిజానికి ఒకరకంగా రాజ్ కుంద్ర అరెస్ట్ తర్వాత శిల్ప శెట్టి షాక్ లో ఉన్నారు. అప్పటి నుండి, అతను సూపర్ డాన్సర్ యొక్క నాల్గవ సీజన్ కోసం షూటింగ్ కు కూడా రాలేదు. అందుకే ఇప్పుడు కరిష్మా కపూర్ ఈ కార్యక్రమంలో శిల్పా శెట్టి స్థానంలో జడ్జిగా ఉన్నారు. ఇక మీడియా నివేదికల ప్రకారం, సూపర్ డాన్సర్ యొక్క నాల్గవ సీజన్ షూటింగ్ జరుగుతోంది.

  Shilpa Shetty Hosts A Grand Birthday Bash For Hubby Raj Kundra | Filmibeat Telugu
  కుటుంబంతో కలిసి

  కుటుంబంతో కలిసి

  రాజ్ కుంద్రా అరెస్ట్ నేపధ్యంలో చివరి క్షణంలో, శిల్పా శెట్టి సెట్‌లోకి రావడానికి నిరాకరించారు. శిల్ప శెట్టి దీనికి కారణం చెప్పలేదు. రాజ్ కుంద్రాను అరెస్టు చేసి, జూలై 23 వరకు అతన్ని అదుపులో ఉంచాలని నిర్ణయం తీసుకున్న తరువాత, శిల్పా శెట్టి ఈ క్లిష్ట సమయంలో కుటుంబంతో కలిసి ఉండటానికి నిర్ణయించుకున్నారని అంటున్నారు.

  English summary
  Amid the raj kundra case, Shilpa Shetty Kundra's last social media post before her husband's arrest has caught everyone's attention. The post was captioned as, ''We may not always have the power to change what’s happening around us, but we can definitely control what happens within. That is possible only through Yoga. Give yourself the ability to calm the mind, reduce unwanted thoughts, centre your wandering attention, and improve your focus through Tratak Meditation''
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X