For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఒక్కరాత్రి నాతో పడుకో... కాంప్రమైజ్ అవ్వు... హీరోయిన్‌పై నిర్మాత వేధింపులు..

  |

  బాలీవుడ్‌లో లైంగిక వేధింపులు భాగోతాన్ని మరో హీరోయిన్ బయటపెట్టింది. ఓ డైరెక్టర్ వేధించిన తీరును బాలీవుడ్ నటి శృతి మరాతే బట్టబయలు చేసింది. శృతి మరాతే సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టు వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమెకు అండగా నిలుస్తూ పలు రకాల సందేశాలు పోస్టు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

  16 ఏళ్ల వయసు నుంచి ఇండస్ట్రీలో

  16 ఏళ్ల వయసు నుంచి ఇండస్ట్రీలో

  నా 16 ఏళ్ల వయసు నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్నాను. కెమెరా వెనుక ఎన్నో కష్టాలు పడ్డాను. సినీ తారలంటే ప్రజలకు అపోహలు ఉంటాయి. వారి జీవితం పూలపాన్ను అనుకొంటారు. కానీ అదంతా అబద్ధం. నటీనటులు లైఫ్ ముళ్లపాన్పు అని శృతి తన లేఖలో పేర్కొన్నారు.

  బికినీ ధరించమని అడిగితే

  బికినీ ధరించమని అడిగితే

  నా కెరీర్ ఆరంభంలో దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ చిత్రంలో నటించాను. ఆ సినిమాలో నన్ను బికినీ ధరించమని అడిగితే మరోమారు ఆలోచించకుండా బికినీ వేసుకొన్నాను. సినిమా అవకాశం కోసమే ఆలోచించాను కానీ.. ఎలా షూట్ చేస్తారు? ఇది అవసరమా అని ఆలోచించలేదు అని శృతి లేఖలో తెలిపారు. ఆ తర్వాత నేను పాపులర్ అయి ఓ షోలో పాల్గొన్నాను. అప్పుడు బికినీ ఎలా ధరించావనే ప్రశ్న వేసి నన్ను ట్రోల్ చేశారు.

  నాతో నిర్మాత అసభ్యంగా

  నాతో నిర్మాత అసభ్యంగా

  ఓ సినిమా ఆఫర్ గురించి నిర్మాతను కలిశాను. తొలుత హ్యపీగా సంభాషణ సాగింది. ఆ తర్వాత అతడి వెకిలి చేష్టలు బయటకు వచ్చాయి. ఆఫర్ ఇస్తాను. ఒక్క రాత్రి నాతో పడుకో అని వేధించడం మొదలుపెట్టాడు. సరే నీతో నేను పడుకొంటాను. అయితే హీరోతో ఎవరిని పడుకో బెడుతున్నాను అని బదులు అడిగాను. దాంతో డైరెక్టర్‌కు దిమ్మతిరిగింది అని శృతి మరాతే వెల్లడించారు.

  ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగింపు

  ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగింపు

  డైరెక్టర్ తీరుతో ఆ సమయంలో ఒక్క నిమిషం భయపడకుండా ధైర్యం తెచ్చుకొన్నాను. నాకు నేను అండగా నిలపడటమే కాకుండా.. ప్రతీ మహిళ కోసం ధైర్యాన్ని తెచ్చుకున్నానని, మంచి పని చేసినట్టు అనిపించింది. కానీ ఆ సినిమా నుంచి నన్ను తొలగించారు. అయితే ఆ ప్రాజెక్ట్‌ నుంచి తీసేయడం నాకు బాధకలిగించలేదు అని శృతి తన అనుభవాన్ని పంచుకొన్నారు.

  శృతి మరాతే పోస్టు వైరల్

  శృతి మరాతే చేసిన పోస్టు ఇంటర్నెట్ మీడియాలో వైరల్ అయింది. శృతికి మద్దతుగా ఎన్నో సందేశాలు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయి. నీ ధైర్య సాహసాలకు ఫిదా అయ్యాం. మీ పోరాటం గొప్పది అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

  శృతి మరాతే కెరీర్ ఇలా

  శృతి మరాతే కెరీర్ ఇలా

  శృతి మరాతే బుదియా సింగ్: బార్న్ టు రన్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. తమిళంలో ఇంద్ర విజ, నాన్ అవనిల్లై, గురుశిష్యం చిత్రాల్లో నటించారు. కన్నడలో ఆడు ఆట ఆడు అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత రాధా హీ బవారీ, లంగ్నా‌బాంబాల్ అనే టెలివిజన్ షోలో హోస్ట్‌గా కనిపించారు.

  English summary
  Shruti Marathe actress known for her works in Marathi cinema, Tamil cinema, and television. She made her film debut with the Marathi film Sanai Choughade produced by Shreyas Talpade, and the Tamil film Indira Vizha. Her other works include films such as Naan Avanillai 2, Guru Sishyan , Teecha Baap Tyacha Baap. Shruti Marathe, in a post for Humans of Bombay, talked about her brush with casting couch while she was auditioning for a lead role in a film.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more