Sidharth Shukla death: మరణం వెనుక అసలు కారణాలు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ప్రియురాలు!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో మరో షాకింగ్ ఘటన అందర్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. బిగ్‌బాస్ 13 విన్నర్, ప్రముఖ టెలివిజన్ నటుడు సిద్దార్థ్ శుక్లా మరణం అభిమానులు, సినీ వర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. 40 ఏళ్ల సిద్దార్థ్ మరణవార్త అందర్నీ కలిచివేసింది. ఆయన అంత్యక్రియలు ముంబైలో ఉద్విగ్న భరితమైన క్షణాలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రముఖుల కన్నీటి వీడ్కోలు మధ్య విషాదంగా ముగిసాయి. అయితే సిద్దార్థ్ శుక్లా ప్రేయసి షెహనాజ్ గిల్ ఎమోషనలైన తీరు.. పోలీసులకు వెల్లడించిన తీరు అత్యంత చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే...

అంత్యక్రియలు పూర్తి

అంత్యక్రియలు పూర్తి

సిద్దార్థ్ శుక్లా అంత్యక్రియల సమయంలో ఆయన స్నేహితురాలు, బిగ్‌బాస్ 13లో సహ కంటెంట్ షెహనాజ్ గిల్ హాజరైన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వైరల్ అయ్యాయి. కన్నీరుమున్నీరైన ఆమెను చూసి అందరూ ఎమోషనల్ అయ్యారు. అయితే సిద్దార్థ్ శుక్లా ఎలా మరణించారనే విషయం గురించి త్వరలోనే కూపర్ హాస్పిటల్ వర్గాలు నివేదికను ఇవ్వనున్నట్టు తెలిసింది.

Recommended Video

Sidharth Shukla Biography ఆ రాత్రి ఏం జరిగింది.. ప్రేయసి గుండెబద్ధలు || Filmibeat Telugu
 ముంబై పోలీసులకు వెల్లడించిన ప్రకారం

ముంబై పోలీసులకు వెల్లడించిన ప్రకారం

సిద్దార్థ్ శుక్లా మరణం నేపథ్యంలో మరో సంచనల వార్త బయటకు వచ్చింది. బిగ్ బాస్ విన్నర్ మరణం వెనుక కొన్ని కీలక విషయాలను ఆయన ప్రియురాలు షెహనాజ్ గిల్ ముంబై పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం. గురువారం ఉదయం నిద్ర నుంచి లేకపోవడంతో ఆయనను లేపేందుకు ప్రయత్నించగా అప్పటికే సిద్దార్థ్ దేహం పూర్తిగా చల్లబడిపోయింది అని షెహనాజ్ వెల్లడించినట్టు తెలిసింది.

విగతజీవిగా పడి ఉన్న సిద్దార్థ్ శుక్లా

విగతజీవిగా పడి ఉన్న సిద్దార్థ్ శుక్లా

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ వెబ్‌సైట్ వెల్లడించిన ప్రకారం.. సిద్దార్థ్ విగతజీవిగా పడి ఉండటాన్ని ముందు చూసింది షెహనాజ్ గిల్ మాత్రమే. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను లేపడానికి ఆమె ప్రయత్నించారు. లేవకపోయే సరికి అతడి తలను తన ఒడిలో పెట్టుకొని పదే పదే తట్టి లేపింది. అయితే అప్పటికీ సిద్దార్థ్ మరణించడం వల్ల ఆయన శరీరం పూర్తిగా చల్లబడిపోయింది అని తపేర్కొన్నది.

 షెహనాజ్ గిల్‌ ఫోన్ చేసి

షెహనాజ్ గిల్‌ ఫోన్ చేసి

అలాంటి పరిస్థితుల్లో సిద్దార్థ్ శుక్లాను చూసి.. ఆయన తల్లి, సోదరికి షెహనాజ్ గిల్ ఫోన్ చేసి విషయాన్ని వెల్లడించింది. ఆ తర్వాత ఆయనను పరీక్షించిన ఫ్యామిలీ డాక్టర్ మరణించారని ధృవీకరించారు. అనంతరం షెహనాజ్ తీవ్ర దిగ్బ్రాంతికి గురవ్వడమే కాకుండా ఒక రకమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు అని టెలివిజన్ నటుడు అలీ గోని తెలిపారు.

ట్విట్టర్‌లో సహనటుడు అలా

ట్విట్టర్‌లో సహనటుడు అలా

షెహనాజ్ పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారు అనే విషయాన్ని అలీ గోని ట్విట్టర్‌లో వెల్లడిస్తూ... ఎప్పుడూ నవ్వుతూ ఉండే ముఖం వెలవెలపోయింది. ఇప్పుడు ఆమెను చూస్తే హృదయం ముక్కలైనట్టు కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే సనా (షెహనాజ్) మనోధైర్యంతో ఉండాలి అంటూ అలీ గోనే ట్వీట్‌లో పేర్కొన్నారు.

 సిద్దార్థ్ శుక్లా కెరీర్ ఇలా..

సిద్దార్థ్ శుక్లా కెరీర్ ఇలా..

సిద్దార్థ్ కెరీర్ విషయానికి వస్తే.. బాలిక వధూ, దిల్ సే దిల్ తక్ సీరియల్స్‌లో నటించారు. అలాగే ఆలియాభట్, వరుణ్ ధావన్ జంటగా నటించిన హంప్టీ శర్మ కి దుల్హానియా చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. అలాగే బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్ అనే పాపులర్ షోలో ఆగస్త్య పాత్రలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X