For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Siddarth Shukla Death: అంత్యక్రియల్లో కంటతడి పెట్టించే సన్నివేశం.. హఠాత్తుగా పెరిగెత్తుకు వచ్చిన ప్రియురాలు

  |

  బాలీవుడ్ బుల్లితెర నటుడు, బిగ్ బాస్ 13 విన్నర్ గా నిలిచిన సిద్దార్థ్ శుక్లా ఇటీవల తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. గత ఏడాది ఎలాగైతే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త అందరిని షాక్ కు గురి చేసిందో అదే తరహాలో సిద్దార్థ్ శుక్లా డెత్ న్యూస్ కూడా అందరిని కలచివేసింది. నాలుగు పదుల వయసులోనే అతను గుండెపోటుతో మరణించాడు అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. సిద్దార్థ్ మరణం వెనుక మరేదైనా కారణం ఉందా అనే విషయంలో అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి.

  ఇక శుక్రవారం అతని అంత్యక్రియలు ముగియడంతో చివరి చూపు కోసం ఒక యువతి వేగంగా అంబులెన్స్ దగ్గరకు వచ్చేసింది. మొదట ఆమె ఎవరో జనాలు అంతగా గుర్తుపట్టలేదు. కానీ చాలా రోజులుగా మీడియాలో వినిపిస్తున్న కథనాలు ప్రకారం ఆమె సిద్దార్థ్ శుక్లా ప్రియురాలు అని తెలుస్తోంది. వెంటనే షూటింగ్ ను రద్దు చేసుకొని ఆమె సిద్దార్థ్ ను కడసారి చూసేందుకు హాస్పిటల్ కు పరుగుపరుగున వచ్చింది. సిద్దార్థ్ శుక్లా పార్థివ దేహాన్ని చివరిసారిగా చూసేందుకు కూడా ఆమె తీవ్ర బాధతో వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

  అంత్యక్రియలు పూర్తి

  అంత్యక్రియలు పూర్తి

  సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు, అతను మరణించిన ఒక రోజు తర్వాత మృతికి గల కారణంపై అనేక రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఇంకా పోస్టుమార్టం వివరాలు కూడా బయటకు రాలేదు. ప్రస్తుతం అందరి చూపు కూడా వాటిపైనే ఉంది. సిద్దార్థ్ శుక్లా నిజంగానే గుండెపోటు వచ్చి చనిపోయాడా లేక మరేదైనా కారణం ఉండి ఉంటుందా అనే విషయంలో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోస్టుమార్టం రిపోర్ట్ పైనే ఆ విషయం ఆధారపడి ఉంది.

  చనిపోయే ముందు ఏం జరిగింది?

  చనిపోయే ముందు ఏం జరిగింది?

  అయితే సిద్దార్థ్ చనిపోయే ముందు ఏం జరిగింది అని విషయాలపై కూడా అతని తల్లి సోదరి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బయట భోజనం చేసిన తర్వాత అతను రాత్రి 10: 30-11 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చాడు. సాధారణంగా అతను ఇంట్లో తింటాడు. కానీ ఎందుకో ఆరోజు బయట తినేసి వచ్చాడు. ఇక వెంటనే త గదిలొలి వెళ్లి అతను పడుకున్నాడు. ఇక హఠాత్తుగా ఆరోగ్యం ఎదో ఇబ్బందిగా ఉంది అంటూ తెల్లవారుజామున 3:30 గంటలకు నిద్ర లేచాడట. అతను ఒక గ్లాసు నీరు అడిగాడట.

   అనుమానాలు వచ్చి..

  అనుమానాలు వచ్చి..

  ఇక ఉదయం 7 గంటలకు మళ్ళీ చూసేసరికి అతను అక్కడే పడుకున్నాడు. కానీ అతను నిద్రపోతున్నాడని తల్లీ అనుకుందట. కొంత సమయం తరువాత, అతను నిద్రపోతున్న విధానం కొంచెం అసహజంగా ఉందని ఆమె భావించి తట్టి లేపే ప్రయత్నం కూడా చేశారట. ఇక అనుమానం వచ్చి వెంటనే ఆమె డాక్టర్‌ను పిలిచారు. అనంతరం డాక్టర్ అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

  ఆఖరి చూపు కోస్ ప్రియురాలు

  ఆఖరి చూపు కోస్ ప్రియురాలు

  ఇక సిద్దార్థ్ శుక్లాను ఆస్పత్రికి తీసుకు వచ్చిన అనంతరం అతని మరణవార్తను చెప్పడానికి డాక్టర్లకు పెద్దగా సమయం పట్టలేదు. ఇక అతని మరణవార్త గురించి తెలియగానే బాలీవుడ్ లో అతని సన్నిహితులు హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే సిద్దార్థ్ శుక్లాతో గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న అమ్మాయిలలో షెహ్నాజ్ గిల్ ఉన్నారు. ఇక ఆమె శుక్రవారం శ్మశానవాటికకు చేరుకోగా ఒక్కసారిగా ఆ వార్త బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

  వారి మధ్యలో ప్రేమ ఉన్నట్లు కథనాలు

  వారి మధ్యలో ప్రేమ ఉన్నట్లు కథనాలు

  స్నేహితులు, అభిమానులు సిద్దార్థ్ మరణించిన రోజు సిద్ధార్థ్ శుక్లా నివాసానికి వచ్చారు. సిద్ధార్థ్ అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. ఇక చివరి చూపు కోసం షెహ్నాజ్ గిల్ పరుగుపరుగున అంబులెన్స్ వద్దకు వెళ్లారు. ఆమె సిద్దార్థ్ ను చూసి చాలానే ఏడ్చేసిందట. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరక్ గా మారాయి. వీరిద్దరు బిగ్ బాస్ 13 లో కంటెస్టెంట్ గా వెళ్లారు. ఈ ఇద్దరి కెమిస్ట్రీ కూడా అక్కడ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా ఈ ఇద్దరు క్లోజ్ గానే ఉన్నారు. బాలీవుడ్ మీడియాలో చాలా కాలంగా అనేక రకాల కథనాలు అయితే వచ్చాయి. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఆ విషయంలో క్లారిటీ అయితే ఇచ్చింది లేదు.

  షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని

  షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని

  ఇక సిద్దార్థ్ శుక్లా మరణం గురించి తెలియగానే షెహ్నాజ్ గిల్ ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం కూడా దెబ్బ తిన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. హాస్పిటల్ వద్దకు కూడా ఆమె చాలా బాధతోనే వచ్చారు. తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురైనట్లు అనిపిస్తోంది. ఆమె ఇటీవల ఒక సినిమా షూటింగ్ కోసం పంజాబ్ కు వెళ్లిందట. ఇక మరణవార్త గురించి కూడా తెలియగానే ఒక్కసారిగా షెహ్నాజ్ గిల్ షాక్ అయ్యిందట. వెంటనే షూటింగ్ ను రద్దు చేసుకొని ఆమె సిద్దార్థ్ ను కడసారి చూసేందుకు హాస్పిటల్ కు పరుగుపరుగున వచ్చింది. సిద్దార్థ్ శుక్లా పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు కూడా ఆమె తీవ్ర బాధతో వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

  English summary
  Sidharth Shukla funeral in Shehnaaz Gill attends last rites emotional video viral,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X