»   » "నా వల్లే సూపర్ స్టార్ అయ్యాడు, కానీ అవమానం జరిగింది... నేనిచ్చిన షాక్‌తో డౌన్"

"నా వల్లే సూపర్ స్టార్ అయ్యాడు, కానీ అవమానం జరిగింది... నేనిచ్చిన షాక్‌తో డౌన్"

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ గురించి ప్రముఖ సింగర్ అభిజీత్ భట్టాచారి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. 90ల్లో షారుక్ ఖాన్ నటించిన దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, ఎస్ బాస్, బాద్‌షా, ఫిర్ బి దిల్ హై హందూ స్థానీ చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన ఈ సీనియర్ సింగర్... తాను పాటలు పాడటం వల్లే షారుక్ ఖాన్ సూపర్ స్టార్ అయ్యాడని, అయితే తనకు జరిగిన అవమానంతో అతడికి పాటలు పాడటం మానేశానని, నేనిచ్చిన షాక్‌తో అతడి సూపర్ స్టార్ ఫేం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది అంటూ వ్యాఖ్యానించారు.

  అభిజీత్ సంచలన వ్యాఖ్యలు

  అభిజీత్ సంచలన వ్యాఖ్యలు

  ముంబయిలో జరిగిన ఇండియా టుడే సఫాయ్‌గిరి సమ్మిట్‌ అండ్ అవార్డ్స్‌ 2018 కార్యక్రమంలో పాల్గొన్న అభిజీత్ తాను ఎందుకు షారుక్ ఖాన్ సినిమాలకు పాటలు పాడటం ఆపేశానో వెల్లడించారు. 2009లో వచ్చిన షారుక్ మూవీ ‘బిల్లు బార్బర్' తర్వాత నుండి అభిజీత్ అతడి సినిమాలకు పాడటం లేదు.

  నేనిచ్చిన షాక్‌తో

  నేనిచ్చిన షాక్‌తో

  నా పాటలతో ఎందరినో సూపర్‌స్టార్లను చేశాను. నేను షారుక్‌ సినిమాలకు పాటలు పాడుతున్నంత వరకు అతనో రాక్‌స్టార్. ఎప్పుడైతే అతని కోసం పాడటం మానేశానో అతని స్థాయి లుంగి డాన్స్ స్థాయికి పడిపోయింది.... అని అభిజీత్ వెల్లడించారు.

  నాకు అవమానం జరిగింది

  నాకు అవమానం జరిగింది


  ‘మైహూనా' సినిమాకు నేను షారుక్ కోసం పాటలు పాడాను. టైటిల్స్‌లో స్పాట్‌బాయ్స్‌ దగ్గర నుండి అందరి పేర్లు వేశారు. కానీ థియేటర్లలో ప్రేక్షకులు లేచిపోయే సమయంలో నా పేరు వేశారు. ‘ఓం శాంతి ఓం' సినిమా సమయంలో కూడా ఇలాగే జరిగింది. అది నేను అవమానంగా ఫీలయ్యాను... అని అభిజీత్ తెలిపారు.

   నాకూ ఆత్మాభిమానం ఉంది

  నాకూ ఆత్మాభిమానం ఉంది


  వరుసగా అలా జరుగడంతో ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లు అనిపించింది. అలా అని నేను ఎక్కడా నా అసంతృప్తి చూపించలేదు. నా పేరు ముందు ఎందుకు వేయలేదు? అని ప్రశ్నించలేదు, అదే విధంగా నా పేరు వేయండి అని నేను అడగలేదు. ఎందుకంటే నాకూ ఆత్మాభిమానం ఉంది అని అభిజీత్ భట్టాచారి వ్యాఖ్యానించారు.

  బాలీవుడ్‌కే పరిమితం కాదు

  బాలీవుడ్‌కే పరిమితం కాదు


  నన్ను నేను ఎప్పుడూ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీకి చెందిన వాడిగా చెప్పుకుంటాను... బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాడిగా చెప్పుకోను అని ఈ సందర్భంగా అభిజీత్ భట్టాచార్య స్పష్టం చేశారు.

  English summary
  Singer Abhijeet Bhattachary gradually stopped singing for Shah Rukh after the actor's 2009 film Billu Barber. In a candid conversation at the India Today Safaigiri Summit and Awards 2018, the Bollywood playback singer opened up why he decided to stop singing for Shah Rukh. He added, "It was a very small reason I stopped singing for Shah Rukh. In Main Hoon Na, they showed everyone from a spot boy to everyone else, but the singers. The same thing happened with Om Shanti Om. Stars sang Dhoom Tana. It was my voice. But it wasn't shown anywhere. The self-respect was hurt. Why should I ask them to add my name? The problem is I don't lack anything. So why should I ask for this?"
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more