neha Ullal On Her Reentry In Films | అప్పట్లో హీరోయిన్లకు నరకం కనిపించేది - స్నేహా ఉల్లాల్
అనారోగ్యం, ఇతరత్రా విషయాల కారణంగా అందాల భామ స్నేహ ఉల్లాల్ సినీ పరిశ్రమకు దూరమైంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలపై దృష్టి సారించినట్టు కనిపిస్తున్నది. తొలుత ఐశ్వర్య రాయ్‌లా కనిపిస్తారనే ముద్ర వేసుకొన్న స్నేహ ఉల్లాల్ బాలీవుడ్‌లో ఎక్కువ కాలం నిలదొక్కకోలేకపోయారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అడపాదడపా మెరిసిన ఈ అందాల భామ ప్రస్తుతం కెరీర్‌ను పరుగులు పెట్టించేందుకు సిద్ధమైంది. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో పలు విషయాలను వెల్లడించారు..
హీరోయిన్లకు సముచిత స్థానం
సినీ పరిశ్రమలో మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనుకొంటున్నాను. ఇప్పడు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు సముచిత గౌరవం లభిస్తున్నది. ఇది పరిశ్రమకు శుభపరిణామం. మహిళలకు స్వేచ్ఛ, గౌరవం ఎప్పుడు లభిస్తుందా అని వేచిచూసే సమయానికి ప్రస్తుతం సానుకూలంగా ఉంది అని స్నేహా ఉల్లాల్ అన్నారు.
అప్పట్లో పరిస్థితులు నరకంగా
2005లో నన్ను సల్మాన్ ఖాన్ సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. అప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. హీరోయిన్లకు పరిస్థితులు చాలా నరకంగా ఉండేవి. కానీ ఇప్పుడు సినిమా మేకింగ్‌లో, నిర్మాణంలో అనేక మార్పులు సంభవించాయి. ముఖ్యంగా మహిళలకు సముచితమైన గౌరవం దక్కుతున్నది అని అన్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో మంచి చిత్రాలు
ప్రస్తుతం బాలీవుడ్, డిజిటల్ ఫ్లాట్‌ఫాం నుంచి మంచి చిత్రాలు వస్తున్నాయి. అందుకే నేను నెట్‌ఫ్లిక్స్ షోలో నటించేందుకు ఆసక్తి చూపాను. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత నేను నెట్‌ఫ్లిక్స్‌కు ఫ్యాన్‌గా మారిపోయాను అని స్నేహ ఉల్లాల్ చెప్పారు.
అవి మిట్టల్‌తో డేటింగ్‌పై
ఇదిలా ఉండగా, స్నేహ ఉల్లాల్ ప్రస్తుతం ఆల్ ఇండియా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ అవి మిట్టల్‌తో డేటింగ్ చేస్తున్నారు. ఇటీవల మాల్దీవులకు వెళ్లిన వారి విహార యాత్ర ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే మిట్టల్‌తో డేటింగ్‌పై వెల్లడించడానికి నిరాకరించారు.
స్నేహ ఉల్లాల్ కెరీర్ గురించి
స్నేహ ఉల్లాల్ కెరీర్ విషయానికి వస్తే.. 2005లో సల్మాన్ ఖాన్‌తో లక్కీ.. నో టైమ్ ఫర్ లవ్ అనే చిత్రంతో పరిశ్రమకు పరిచయమైంది. తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, సింహా, అలా మొదలైంది చిత్రాల్లో నటించింది.
Actress Sneha Ullal wants to come back to the business because she believes that the entertainment industry is currently celebrating womanhood in the right manner. Sneha has worked for films in Tollywood naming Ullasamga Utsahamga, Simha, Ala Modalaindi among others.
Story first published: Tuesday, February 5, 2019, 10:48 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more