బాల్యంలోనే లైంగిక దాడులు.. 14 ఏట రేప్‌కు గురయ్యా.. సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి
బాలీవుడ్‌లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మీ టూ ఉద్యమ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి తనపై పాకిస్థాన్‌లో జరిగిన లైంగిక దారుణాలపై మరోసారి గుర్తు చేసుకొన్నారు. బాల్యంలో తనపై జరిగిన రేప్, లైంగిక వేధింపులను సోషల్ మీడియా వెబ్‌సైట్ ఇన్స్‌టాగ్రామ్ ద్వారా బహిర్గతం చేశారు. మీ టూ ఉద్యమంలో భాగస్వామ్యులవుతున్న వారికి సంఘీభావం తెలిపారు. ఇన్స్‌ట్రాగ్రామ్ పోస్టులో సోమీ అలీ ఏమన్నారంటే..

మీటూ ఉద్యమానికి సెల్యూట్
బాల్యంలో నా వయసు 5 ఏళ్లు ఉన్నప్పుడు లైంగిక దాడులు జరిగాయి. 14 ఏట నన్ను మానభంగం చేశారు. ఇప్పుడు ఔత్సాహిక తారలపై సినీ ప్రముఖులు చేసిన దాష్టికాలు బయటకు రావడం సంతోషం. లైంగిక వేధింపులను బయటపెడుతున్న వారికి నా సెల్యూట్. ఎందుకంటే అలాంటివి బయటపెట్టడం చాలా కష్టమైన పని అని సోమీ అలీ వెల్లడించారు.

మానసిక స్థైర్యంతో
తమపై జరిగే లైంగిక దాడులు, వేధింపులను బయటపెట్టడానికి చాలా ధైర్యం ఉండాలి. బయటి ప్రపంచానికి తెలియని విషయాలు చెప్పాలంటే చాలా మానసిక స్థైర్యం ఉండాలి. అలాంటి దారుణమైన స్థితి నుంచి బయటపడి బతుకుతున్నాను. ఇలాంటి విషయాలు బయటపెట్టినపుడు పక్కన మనకు అండగా ఉంటారనుకొనే వారి నుంచే నరకం మొదలవుతుంది అని సోమీ అలీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఫైనల్‌గా మానసికంగా నలిగిపోయి బ్రతుకుతూ..
మన చుట్టూ ఉండే వాళ్ల కోసం బాధపడొద్దు. వారిని చూసి నిజం చెప్పడాన్ని ఆపకూడదు. నీ మనసులో ఉండే మాటను బయటపెట్టడానికి ప్రతీ అవకాశాన్ని చేజార్చుకోవద్దు. మానసికంగా నలిగిపోయి బ్రతుకుతూ ఉండే వాళ్లు ప్రతీ అవకాశాన్ని వదులుకోవాలి. న్యాయం జరుగడానికి ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని సోమి అలీ పేర్కొన్నారు.

ఇంట్లో పనిమనిషి నాపై లైంగికంగా..
మార్చి 2015లో తనపై జరిగిన లైంగిక దారుణాలను సోమి అలీ వెల్లడించింది. నా వయసు ఐదేళ్లు ఉన్నప్పుడు ఇంట్లో పనిమనిషి నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అమెరికాలోని స్కూల్స్, యూనివర్సిటీల్లో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు వివరంగా వెల్లడించాను.

అమెరికాలో ధైర్యంగా చెప్పా
విద్యార్థులకు ఇలాంటి వేధింపులు ఎలా ఉంటాయో చెప్పడం చాలా ముఖ్యం. నా కష్టాలను బాధితురాలిగా ధైర్యంగా చెప్పాను. పాకిస్థాన్‌లో మహిళలపై ఇలాంటి ఘోరాలు చాలానే జరుగుతుంటాయి. గృహిణులపై శారీరక హింస ఎక్కువగా ఉంటుంది. ఎందరో తల్లలు ఇలాంటి వేధింపులకు బలవుతుంటారు అని సోమీ అలీ చెప్పారు.
Recommended Video


సల్మాన్ ఖాన్‌తో అఫైర్
పాకిస్థాన్‌కు చెందిన సోమీ అలీ 90వ దశకం ఆరంభంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. శృంగార తారగా పేరు సంపాదించుకొన్న సోమీ అలీ.. సల్మాన్ ఖాన్‌తో ప్రేమాయణం సాగించింది. కొన్నేళ్ల తర్వాత వారిద్దరూ విడిపోయారు. అమెరికాలో నో మోర్ టియర్స్ అనే స్వచ్చంద సంస్థను నడుపుతున్నారు.


Click it and Unblock the Notifications











