గర్ల్ ఫ్రెండ్ కి ఐఫోన్ ఇమ్మని అడిగిన నెటిజన్.. సోనూ సూద్ షాకింగ్ రిప్లై!

సినిమాల్లో విలన్ రోల్స్ ఎక్కువగా చేసే సోను సూద్ రియల్ లైఫ్ లో మాత్రం అందరికీ హీరోగా మారాడు. ఇండియాని కరోనా భయపెడుతున్న వేళ తానున్నానని అభయమిస్తూ ఎవరు ఏ సహాయం అడిగినా కాదనకుండా చేస్తూ వెళుతున్నాడు. ముఖ్యంగా రెండో దశ కరోనాలో ఆక్సిజన్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో సంజీవని తెచ్చిన చిరంజీవిలా అందరికీ ఆక్సిజన్ కూడా అందించాడు. అయితే ఆయన చేస్తున్న సేవను కొందరు మిస్ యూజ్ చేయడానికి చూస్తున్నారు. తాజాగా అలా ఒక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ కి ఐఫోన్ గిఫ్ట్ ఇమ్మని అడిగితే సోనూ సంచలన సమాధానం ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే

తమిళ సినిమాతో ఎంట్రీ

తమిళ సినిమాతో ఎంట్రీ

ఎక్కడో పంజాబ్ లో పుట్టిన సోనూసూద్ నటన మీద ఆసక్తితో ముంబై చేరుకున్నాడు. కానీ ఆయనకు బాలీవుడ్ అవకాశాలు దక్కడాని కంటే ముందే తమిళ, తెలుగు బాషలలోనే అవకాశాలు దక్కాయి. 1999లో విడుదలైన తమిళ సినిమాలో ఆయన ఒక పూజారి పాత్రతో సినీ తెరంగ్రేటం చేశాడు.

సూపర్ తో తెలుగలో

సూపర్ తో తెలుగలో

తెలుగులో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ అనే సినిమాలో సోనూసూద్ ఒక చిన్న పాత్రలో నటించినా ఆ తర్వాత కూడా ఆయనకు సరైన అవకాశాలు మాత్రం దక్కలేదు. కానీ 2005లో నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ సినిమా ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది.

ఇప్పుడు ఆచార్యలో

ఇప్పుడు ఆచార్యలో

సూపర్ సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్లకు రిలీజ్ అయిన అతడు సినిమా కూడా సూపర్ హిట్ గా నిలవడంతో సోనూసూద్ కు నెగటివ్ రోల్స్ రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం ఆయన తెలుగులో చిరంజీవి హీరోగా చేస్తున్న ఆచార్య అనే సినిమాలో విలన్ గా చేస్తున్నారు. ఇప్పుడు రియల్‌ హీరోగా మారిన సోనూసూద్‌ అందరికీ సహాయం చేస్తున్నారు.

ఫన్నీ రిక్వెస్ట్

ఫన్నీ రిక్వెస్ట్

అవసరమైన వారికి తన సేవలను అందించడంలో బిజీగా ఉన్న సోను సూద్ సోమవారం చాలా ఫన్నీ అభ్యర్థన అందుకున్నాడు. ఒక వ్యక్తి తన ప్రియురాలు ఐఫోన్‌ను డిమాండ్ చేస్తోందని, దానికి సహాయం చేయగలరా అని నటుడిని అడిగాడు.

Recommended Video

Sonu Sood To Set Up Oxygen Plants In Kurnool, Nellore Hospitals || Filmibeat Telugu
దిమ్మ తిరిగే రిప్లై

దిమ్మ తిరిగే రిప్లై

దీంతో "ఉస్కా తో పాటా నహి, అగర్ ఐఫోన్ డియా తోహ్, పార్ తేరా కుచ్ నహి రహేగా (నాకు దాని గురించి తెలియదు కాని నేను ఆమెకు ఫోన్ తీసుకుంటే దాని నుండి మీకు ప్రయోజనం ఉండదు)" అని నటుడు బదులిచ్చారు. అంటే తాను ఫోన్ గిఫ్ట్ ఇస్తే ఆమె ఇక నీతో మాట్లాడదు తనతో మాట్లాడుతుంది అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X