స్టార్ డైరెక్టర్ సినిమాలో హీరోగా సోనూసూద్.. ఇప్పట్లో కుదిరేలా లేదట?

సీనియర్ మోస్ట్ విలన్ గా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సోనూసూద్ భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో అతను చాలా సినిమాలు చేశాడు. అందుకే ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఇదే నా సెకండ్ హోమ్ అని అంటుంటారు. గత కొంతకాలంగా సోనూసూద్ రియల్ హీరోగా జనాలకు మరింత దగ్గరవుతున్న విషయం తెలిసిందే.

కరోనా సెకండ్ వేవ్ లో కూడా కష్టాల్లో ఉన్న వారికి తనవంతు సహాయాన్ని అందిస్తున్నాడు. ఇక నటుడిగా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. అయితే ఇదివరకు నెగిటివ్ రోల్స్ ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు కాస్త పాజిటివ్ రోల్స్ వస్తున్నాయి. జనాలు అతన్ని వెండితెరపై కూడా విలన్ గా చూసేందుకు ఇష్టపడడం లేదు. ఇక హీరోగా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయట.

Sonu sood new movie tollywood star director plans cancelled

ఇటీవల దర్శకుడు క్రిష్ సోనూసూద్ తో ఒక కథపై చర్చలు జరిపినట్లు టాక్ అయితే వచ్చింది. కానీ సోనూసూద్ చేతిలో ప్రస్తుతం ఏడు సినిమాలు ఉన్నాయట. వాటి కోసం డేట్స్ అడ్జస్ట్ చేయలేక కాస్త కన్ఫ్యూజ్ అవుతున్మాడ. వచ్చే ఏడాది కూడా ఖాళీగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇక దర్శకుడు క్రిష్ కూడా పవన్ కళ్యాణ్ సినిమాతో బిజిగా ఉన్నాడు. వచ్చే ఏడాది కూడా సోనూసూద్ అంత తొందరగా క్రిష్ సినిమాను స్టార్ట్ చేయకపోవచ్చని టాక్ అయితే వస్తోంది. సోనూసూద్ కూడా తొందర పడకుండా ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. హీరోగా చేస్తే మరింత బిజీగా వర్క్ చేయాలి కాబట్టి చేయాలా వద్దా అనే ఆలోచనలో కూడా ఉన్నాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X