For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SS Rajamouli: హృతిక్ రోషన్ పై రాజమౌళి వివాదస్పద వ్యాఖ్యలు.. తప్పు ఒప్పుకున్న జక్కన్న!

  |

  తెలుగు ప్రేక్షకులకు ఎస్ఎస్ రాజమౌళి గురించి పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు యావత్ ప్రపంచానికి కేవలం పరిచయానికే పరిమితం కాకుండా హాలీవుడ్ లెజండ్ డైరెక్టర్లు సైతం మెచ్చుకునే స్థాయికి ఎదిగాడు తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ గా జక్కన్న తెరకెక్కిన RRR చిత్రానికి అవార్డులు సైతం బ్రహ్మరథం పడుతున్నాయి. తాజాగా RRR మూవీని క్రిటిక్ ఛాయిస్ విభాగంలో రెండు అవార్డ్స్ వరించాయి. ఇదిలా ఉంటే రాజమౌళిని మరోవైపు ఒక వివాదం వెంటాడుతోంది. ఈ క్రమంలో దానిపై వివరణ ఇచ్చాడు జక్కన్న.

   టీవీ సీరియల్ తో..

  టీవీ సీరియల్ తో..

  తెలుగు చిత్రసీమలో ఓటమి ఎరగని దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది అందరూ ముక్త కంఠంతో చెప్పే పేరు ఎస్ఎస్ రాజమౌళి. శాంతి నివాసం అనే టీవీ సీరియల్ తో ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం నేడు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో సినిమా దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి ఇటీవలి RRR మూవీతో వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

   తెలుగు సినిమా ఖ్యాతి పెరిగేలా..

  తెలుగు సినిమా ఖ్యాతి పెరిగేలా..

  మొదటి సినిమా నుంచి RRR వరకు రాజమౌళి తెరకెక్కినంచిన ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అందుకే ఆయన్ను ఓటమెరుగని ధీరుడు అని పిలుస్తుంటారు. దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన కళా ఖండాలు అనేకం. ఆయన తెరకెక్కించిన మగధీర, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాయి. ప్రపంచానికి చాటి చెప్పాయి.

   రెండు అవార్డులు..

  రెండు అవార్డులు..

  ఇప్పుడు రాజమౌళి RRR సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డుల పంట కొనసాగుతోంది. ఇటీవల ఎంతో సూపర్ హిట్ అయిన నాటు నాటు పాటకు వచ్చిన గోల్డెన్ గ్లోబ్ అవార్డును సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి అందుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కాలిఫోర్నియాలో జరుగుతోన్న క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల కార్యక్రమంలో బెస్ట్ సాంగ్‌గా నాటు నాటు, బెస్ట్ ఫారెన్ లాగ్వేజ్ మూవీ విభాగంలో RRR ఎంపిక కాగా.. ఎమ్ఎమ్ కీరవాణి, రాజమౌళి, కార్తికేయ కలిసి ఆ అవార్డులను వరుసగా అందుకున్నారు.

  RRR కు ఆస్కార్..

  RRR కు ఆస్కార్..

  ఇదిలా ఉంటే 2023 ఆస్కార్ అవార్డుల్లో భాగంగా అకాడమీ పది విభాగాల్లో షార్ట్ లిస్టులను విడుదల చేసింది. ఇందులో ఒరిజినల్ సాంగ్ విభాగంలో పదిహేను పాటలను ఉంచగా.. వాటిలో RRR మూవీలోని 'నాటు నాటు' సాంగ్ కూడా చోటు దక్కించుకుంది. అంతేకాకుండా బెస్ట్ ఫీచర్ సినిమా విభాగంలో RRR కూడా చోటు దక్కించుకుంది. దీంతో ఏదో ఒక విభాగంలో RRR సినిమాకు ఆస్కార్ వస్తుందని తెలుగు ప్రేక్షకులు ఆశాభావంతో ఉన్నారు.

  హృతిక్ రోషన్ ఎందుకు పని చేయడు..

  హృతిక్ రోషన్ ఎందుకు పని చేయడు..

  ఇదిలా ఉంటే అప్పుడెప్పుడో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ పై రాజమౌళి చేసిన కామెంట్స్ ఇటీవల తెగ వైరల్ అయ్యాయి. ప్రభాస్ బిల్లా ప్రమోషన్స్ సమయంలో.. "ధూమ్ 2 విడుదలైనప్పుడు హృతిక్ రోషన్ వంటి స్టార్స్ మనకు లేరా అని బాధపడేవాన్ని. 2 డేస్ బ్యాక్ బిల్లాలోని ఓ పాటను మెహర్ రమేష్ చూపించారు. హృతిక్ రోషన్ ఎందుకు పని చేయడు" అని జక్కన్న వ్యాఖ్యానించారు. హృతిక్ రోషన్ ను అవమానించేలా రాజమౌళి మాట్లాడారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించిన రాజమౌళి ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

   ఆయన్ను ఎంతో గౌరవిస్తాను..

  ఆయన్ను ఎంతో గౌరవిస్తాను..

  "పదిహేను ఏళ్ల క్రితానికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడెందుకు వైరల్ అవుతుందో తెలియడం లేదు. ఆ వీడియోను గమనిస్తే అందులో నేను ఎంపిక చేసుకున్న పదాలు బాగా లేవు. ఈ విషయాన్ని నేను ఒప్పుకోవాల్సిందే. అయితే హృతిక్ రోషన్ ను కించపరిచే ఉద్దేశం నిజంగా నాకు లేదు. నేను ఆయన్ను ఎంతో గౌరవిస్తాను" అని రాజమౌళి తెలిపారు. అయితే రాజమౌలి ఇలా చెప్పడంతో నెటిజన్లు ఆయన్ను ప్రశంసిస్తున్నారు. తప్పు ఒప్పుకోవడం గొప్ప విషయం. మరోసారి మీ వినయాన్ని చూపించారు అంటూ నెటిజన్లు అంటున్నారు.

  English summary
  RRR Movie Director SS Rajamouli Reacts To Controversial Comments On Hrithik Roshan Over He Is Nothing To Prabhas In Billa Promotions.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X