Just In
- 1 min ago
రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ రూమర్స్ అన్ని అబద్ధాలే!
- 12 min ago
బిగ్ బాస్ 5 మొదలయ్యేది ఎప్పుడంటే.. మరోసారి సోహెల్ కూడా..
- 1 hr ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 1 hr ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
Don't Miss!
- Finance
ఒక్కరోజులో రూ.2.08 లక్షల కోట్ల సంపద హాంఫట్: 3 రోజుల్లో 1800 పాయింట్లు..
- Sports
ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే.. వాట్సన్ స్థానం అతనిదేనా?
- News
అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రియాతో ఆ బంధం ఏమిటీ.. సీబీఐ ప్రశ్నించలేదా? మహేష్ భట్‌పై సీనియర్ హీరోయిన్ ఫైర్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో సీబీఐ పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసింది. గత పన్నెండు రోజులుగా ముంబైలో అధికారులు పలువురిని ప్రశ్నించి వాస్తవాలను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చకవ్రర్తి, ఆమె కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తమకు తోచిన విధంగా ఈ వివాదంపై స్పందిస్తున్నారు. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో దర్శకుడు మహేష్ భట్‌ను ఉద్దేశించి సీనియర్ హీరోయిన్ సుచిత్ర కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే..

రియా, మహేష్ భట్ వాట్సాప్ ఛాట్ లీక్
సుశాంత్ మరణం కేసులో రియా చక్రవర్తి తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ చేస్తున్నది. ఈ క్రమంలోనే రియా, మహేష్ భట్ మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది. సుశాంత్, రియా రిలేషన్‌షిప్‌లో మహేష్ భట్ జోక్యం ఉందనే ఆరోపణలకు ఛాటింగ్ బలం చేకూర్చింది.

పర్విన్ బాబీ మాదిరిగానే సుశాంత్ కూడా
సుశాంత్ మరణానికి ముందు మహేష్ భట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ తీవ్రస్థాయిలో డిప్రెషన్‌లో ఉన్నారు. ఆయనకూ కూడా సూసైడ్ తప్పదు. బాలీవుడ్ నటి పర్విన్ బాబీ మాదిరిగానే సుశాంత్ కూడా అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తాడనే విధంగా దర్శకుడు మహేష్ భట్ కామెంట్లు చేయడం వివాదంగా మారింది.

మహేష్ భట్ సూచనలతో రియా
అలాగే సుశాంత్ మానసిక రుగ్మతకు గురయ్యారనే వార్తల నేపథ్యంలో ఆయనకు వైద్యుడి సూచనలు లేకుండా ప్రమాదకరమైన డ్రగ్స్ రియా చక్రవర్తి అందించారనే విషయం మరింత సంచలనం రేపింది. మహేష్ భట్ సూచనతోనే సుశాంత్‌కు ప్రమాదకరమైన మందులు ఇచ్చారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి ఆరోపణల మధ్య నటి సుచిత్ర కృష్ణమూర్తి ట్వీట్ బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

రియాను సీబీఐ ప్రశ్నించలేదా?
సుశాంత్ మరణం కేసులో మహేష్ భట్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ సమన్లు పంపిందా? ఆయన అంత మొండిగా ఎందుకు ఉన్నారు? జూన్ 8వ తేదీన సుశాంత్‌ను రియా విడిచి పెట్టి ఎందుకు వెళ్లింది అంటూ సుచిత్ర కృష్ణమూర్తి ట్వీట్ చేశారు. రియా, మహేష్ మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉందనే విధంగా ఆమె ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఆమె నర్మగర్భంగా ఎందుకు ట్వీట్ చేశారనే విషయం కొందరికి అంతుచిక్కకుండా అనుమానాలను రేకెత్తించింది.

లీకైన వాట్సాప్ ఛాటింగ్‌లో
జూన్ 8వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటి నుంచి రియా చక్రవర్తి వెళ్లిన తర్వాత ఆమెకు మహేష్ భట్‌కు మధ్య వాట్సాప్‌లో చాటింగ్ జరిగింది. వెనకకు తిరిగి విషయాలను చూసుకోకు. ఏది అనివార్యమనే విషయం సాధ్యమో చూసుకోవాలి. నీ నిర్ణయంపై నీ తండ్రి హ్ాయపీగా ఫీలవుతారు. ఆయనకు నా ధన్యవాదాలు తెలియజేయండి అంటూ మహేష్ భట్ మెసేజ్ పంపారు.