twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్‌ను హత్య చేశారు.. వారిని జైల్లో పెట్టాల్సిందే.. రేసుగుర్రం విలన్ సంచలన ఆరోపణలు

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సీబీఐ, ఈడీ, ఎన్సీబీ దర్యాప్తు చేస్తున్న సమయంలో రేసుగుర్రం ఫేం నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ మరణం విషయంలో వాస్తవాలు వెలికి తీసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశానని ఆయన మీడియాకు వెల్లడించారు. సుశాంత్ మరణం వెనుక తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసే అంశాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ..

    సుశాంత్ మరణం పెద్ద మిస్టరీ

    సుశాంత్ మరణం పెద్ద మిస్టరీ

    సుశాంత్ మరణం వెనుక పెద్ద మిస్టరీ ఉంది. ఆయనది సూసైడ్ కాదు. ఆ మరణం వెనుక ఉన్న కుట్రలకు సమాధానం లభించాల్సిందే. సుశాంత్‌ను ఎవరు చంపారు? ఆయన మరణానికి కారణాలు ఏమిటి? ఇలా రేకెత్తుతున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది. సుశాంత్ మరణం వెనకు వాస్తవాలు బయటికి వస్తే.. ఆయన తండ్రికి, ఫ్యామిలీకి గొప్ప రిలీఫ్ ఉంటుంది అని రవికిషన్ అభిప్రాయపడ్డారు.

    వారందరినీ జైల్లో పెట్టాలి

    వారందరినీ జైల్లో పెట్టాలి

    బాలీవుడ్‌కు డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయి. హిందీ సినీ పరిశ్రమను డ్రగ్ మాఫియా శాసిస్తున్నది. లాంటి వారని అలాంటి వారిని జైల్లో పెట్టాలి. భారత దేశమంటే యూత్. అలాంటి యువతపై డ్రగ్స్ ప్రభావం పడకూడదు. డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది అని రవి కిషన్ అన్నారు.

     సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్యే

    సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్యే

    సుశాంత్‌ది ఆత్మహత్య కాదు. ప్రణాళిక ప్రకారం చేసిన హత్య. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నానని రవి కిషన్ వెల్లడించారు. సుశాంత్‌ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ముందుకు సంచలన విషయాలు వచ్చాయి. రియాకు డ్రగ్ మాఫియాతో ఉన్న సంబంధాలపై ఆరా తీసేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. రియా, ఆమె సోదరుడు షోవిక్, తదితరులపై కేసులు నమోదు చేశారు.

     రియా అనుమానాస్పదంగా పోలీస్ స్టేషన్‌కు

    రియా అనుమానాస్పదంగా పోలీస్ స్టేషన్‌కు

    ఇక సుశాంత్ కేసులో రియాను సీబీఐ శుక్రవారం 9 గంటలపాటు విచారించింది. సీబీఐ విచారణ అనంతరం డీఆర్డీఏ గెస్ట్ హౌస్ నుంచి రియా నేరుగా ముంబైలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌కు రాత్రి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో మరోసారి రియాను శనివారం కూడా విచారిస్తున్నది.

    Recommended Video

    Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
    ఎనిమిది రోజులుగా విచారణ

    ఎనిమిది రోజులుగా విచారణ


    సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ గత ఎనిమిది రోజులుగా పలువురిని పలు కోణాల్లో విచారించింది. రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి నుంచి స్టేట్‌మెట్ రికార్డు చేశారు. సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితాని, వంట మనిషి నీరజ్ సింగ్, పని మనిషి దీపేష్ సావంత్‌ను ఇప్పటికే పలుమార్లు విచారించారు.

    English summary
    Actor, BJP MP Ravi Kisan made sensational comments on Sushant Singh Rajput death. He said, Sushant was murdered, not suicide. Ravi Kishan further revealed that he has written a letter to Prime Minister Narendra Modi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X