సినిమా వాళ్లను నీచంగా చూస్తారు, ఇల్లు కూడా అద్దెకు ఇవ్వరు: తాప్సీ
Recommended Video
బోల్డ్, కాన్ఫిడెంట్ యాటిట్యూడ్‌తో కనిపించే హీరోయిన్ తాప్సీ ఏ విషయాన్నైనా నర్మగర్భంగా మాట్లాడేస్తుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్లో ఎంటరయ్యాక ఆమెలో ఆత్మవిశ్వాసం మరింత ఎక్కువైందనే చెప్పాలి. పింక్, బేబీ, నామ్ షబానా, బద్లా లాంటి భిన్నమైన చిత్రాలతో నటిగా నిరూపించుకుని వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఇక్కడి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేస్తోంది.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన తాప్సీ కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టాలు పడింది. తాను సింగిల్ యాక్టర్ కావడంతో ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండే వారు కాదని, అపుడు చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని ఆమె తాజాగా ఓ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో తెలిపారు.

సినిమా వాళ్లను నీచంగా చూస్తారు
ప్రజలకు మేము చేసే పనిపై నమ్మకం ఉండదు. నీచంగా చూస్తారు. రూ. 500 ఖర్చుపెట్టి మమ్మల్ని థియేటర్లో చూడటానికి వస్తారు, లైవ్ కాన్సెర్టుల్లో మేము ఇచ్చే ప్రదర్శన చూసి ఎంజాయ్ చేస్తారు. కానీ మాతో కలిసి ఒకే సమాజంలో నివసించడానికి ఇష్టపడరు. కెరీర్ మొదట్లో నాకు ఇలాంటి పరిస్థితి ఇబ్బందిగా అనిపించింది... అని తాప్సీ చెప్పుకొచ్చారు.

హైదరాబాద్‌లో అలాంటి ఇబ్బంది కలుగలేదు
చాలా మంది ఇల్లు అద్దెకు ఇవ్వడానికి తిరస్కరించడంతో ముంబైలో మంచి అపార్ట్‌మెంట్ దొరకడానికి దాదాపు నెల రోజులు సమయం పట్టింది. అయితే హైదరాబాద్‌లో నాకు ఇలాంటి ఇబ్బంది ఏర్పడలేదు. నేను ఢిల్లీ అమ్మాయిని. హైదరాబాద్, ఢిల్లీ దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ ముంబై నాకు కొత్త ప్రాంతం. అయితే ఇపుడు నాకు ఇక్కడ అపార్ట్‌మెంట్ దొరికింది. నా సిస్టర్‌తో హ్యాపీగా సెటిలయ్యాను. మా తల్లిదండ్రులు ఇప్పటికీ ఢిల్లీలోనే ఉంటున్నారని తాప్సీ తెలిపారు.

తెలుగు సినిమాతో కెరీర్ మొదలు
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఝుమ్మంది నాదం' సినిమాతో తాప్సీ తన కెరీర్ మొదలు పెట్టింది. టాలీవుడ్లో అందం పరంగా, నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. క్రమక్రమంగా బాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఆమె వరుస విజయాలు అందుకుంటూ దూసుకెళుతోంది.

తాప్సీ పన్ను
ప్రస్తుతం తాప్సీ వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. అక్షయ్ కుమార్ మూవీ మిషన్ మంగళ్ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. సాంద్ కి ఆంఖ్ చిత్రంలో 60 ఏళ్ల వృద్ధురాలైన షూటర్ పాత్రలో నటిస్తోంది. ఆమె నటించిన ‘తడ్కా', ‘గేమ్ ఓవర్' చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











