నిన్ను దూరం పెట్టలేం
కంగనను ప్రేమించ వచ్చు.. ద్వేషించ వచ్చు. కానీ ఆమెను దూరం పెట్టలేం అంటూ తనుశ్రీ దత్తా లేఖలో ప్రస్తావించారు. అంతేకాకుండా మణికర్ణిక చిత్రంతో సాధించిన విజయాన్ని ప్రశంసించారు. కంగన నంబర్‌వన్ నటి అని పొగడ్తలతో ముంచెత్తారు. నీకు ఎవరూ సాటి లేరంటూ లేఖలో పేర్కొన్నారు.
టాలెంట్‌తోనే నీకు విజయాలు
బాలీవుడ్‌లో కంగన A++ నటి అని ఎందుకు అన్నానంటే.. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎన్నో విజయాలను అందుకొన్నారు. స్టార్ హీరోలు ఆమెకు సిఫారసు చేయలేదు. కేవలం టాలెంట్‌తోనే విజయాలను అందుకొన్నారు. హీరోల వేధింపుల తట్టుకొని వారికి ధీటుగా నిలబడింది అని తనుశ్రీ దత్తా పేర్కొన్నది.
హీరోలు తాము దేవుళ్లనుకొంటారు
కంగన నిన్ను ఎవరూ సపోర్ట్ చేయరు ఎందుకంటే వారికి అంగ, అర్ధబలం ఎక్కువ. సినీ పరిశ్రమలో తమకు తాము దేవుళ్లు అనుకొనే హీరోలు నీకు ఎన్నటికీ సపోర్ట్ చేయరు. అలాంటి వారికి మణికర్ణిక విజయంతో ముఖం మీద కొట్టావు. వారికి ఓ గుణపాఠం. నీవు ఇచ్చిన షాక్ నుంచి బయటపడాలంటే చాలా కాలం పట్టే అవకాశం ఉంది.
త్వరలోనే మణికర్ణికను చూస్తా
నీవు నటించిన మణికర్ణిక ఇంకా చూడలేదు. అమెరికాలోని నా ఫ్రెండ్స్ చూడమని చెప్పారు. త్వరలోనే నీ సినిమాను చూస్తాను. కానీ నా తల్లిదండ్రులు చూసి నీ నటనపై ప్రశంసలు గుప్పించారు. ఇక ముందు మంచి పాత్రలతో బాలీవుడ్‌ను ఉర్రూతలూగించు అని తనుశ్రీ దత్తా లేఖలో ఘాటుగా రాశారు.