For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అందరిని పక్కకు పంపి చిత్రహింసలు పెట్టాడు.. ఐటెం సాంగ్ షూటింగ్‌లో.. బాలయ్య హీరోయిన్!

  |

  ఆషిక్ బనాయా అపనే చిత్రంతో యువతకు నిద్ర లేకుండా చేసిన తనుశ్రీ దత్తా కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఆ చిత్రంతో శృంగార సన్నివేశాల్లో నటించిన సంచలనం సృష్టించింది. గత రెండేళ్లుగా అమెరికాలో ఉంటున్న తనిశ్రీ ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చింది. బాలీవుడ్ చిత్రాల్లో నాజూకైన అందంతో మతి పోగొట్టిన తనుశ్రీ ఇటీవల ఇండియా నుంచి రాగానే ఆమె లుక్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. తనిశ్రీ బాగా బొద్దుగా మారిపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో భాగంగా తనుశ్రీ గతంలో తాను బాలీవుడ్ లో ఎదుర్కొన్న సమస్యల గురించి వివరించింది.

  పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

  మీ టూ క్యాంపైన్

  మీ టూ క్యాంపైన్

  హీరోయిన్లపై లైంగిక వేధింపుల అంశం గురించి హాలీవుడ్ లో దుమ్ము దుమారం లేచింది. లైంగిక వేధింపులకు గురైన నటీమణులంతా ఒక్కసారిగా సోషల్ మీడియాలో మీ టూ క్యాంపైన్ మొదలు పెట్టారు. ఈ క్యాంపైన్ తో మిగిలిన హీరోయిన్లు కూడా ప్రేరణ పొంది తమకు జరిగిన అన్యాయాల్ని ధైర్యంగా వెల్లడిస్తున్నారు.

  ఆ జాబితాలో మరో నటి

  ఆ జాబితాలో మరో నటి

  బాలీవుడ్ లో కూడా మీ టూ క్యాంపైన్ ఊపందుకుంటోంది. ఇప్పటికే రాధికా ఆప్టే, రిచా చద్దా, స్వర భాస్కర్ వంటి హీరోయిన్లు బాలీవుడ్ లో లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఆ జాబితాలోకి హాట్ బ్యూటీ తనుశ్రీ దత్త కూడా చేరింది.

  లైంగిక వేధింపులు

  లైంగిక వేధింపులు

  హాలీవుడ్ లో పెద్ద ఎత్తున మీ టూ క్యాంపైన్ జరిగింది. బాలీవడ్ లో ఎందుకు జరగడం లేదు అని తనని చాలా మంది అడుగుతున్నట్లు తనిశ్రీ దత్త ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఎవరికీ వారు ధైర్యంగా ముందుకు వచ్చే వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది. 2008లో హార్న్ ఒకే ప్లీజ్ చిత్రంలో ఐటెం సాంగ్ షూట్ సందర్భంగా తనని ఓ నటుడు లైంగికంగా వేధించాడని తనుశ్రీ సంచలన వ్యాఖ్యలు చేసింది.

  చిత్రహింసలు

  చిత్రహింసలు

  నటుడి పేరు చెప్పడానికి ఇష్టపడని తనిశ్రీ దత్త ఆ సంఘటనని వివరించింది. స్పెషల్ సాంగ్ లో నేను సోలో పెర్ఫామెన్స్ చేయాలి. కొరియోగ్రాఫర్స్ డాన్స్ చేయిస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నటుడు నన్ను బలవంతంగా చేతుల్లోకి తీసుకున్నాడు. చాలా ఇబ్బందికి గురి చేశాడు.

  పక్కకు వెళ్ళమని చెప్పి

  పక్కకు వెళ్ళమని చెప్పి

  ఈ సంఘటన జరుగుతున్న సమయంలో కొరియోగ్రాఫర్స్ అక్కడే ఉన్నారు. ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వారిని పక్కకు వెళ్ళమని చెప్పి డాన్స్ పేరుతో నన్ను హింసించాడు. అతడి ఉద్దేశం నాకు పూర్తిగా తెలుసు అని తనిశ్రీ తెలిపింది. ఇలాంటి సంఘటనలతో బాలీవుడ్ పట్ల విసుగు ఏర్పడిందని తనుశ్రీ అభిప్రాయపడింది.

  తెలుగులో కూడా

  తెలుగులో కూడా

  తనుశ్రీ దత్త తెలుగులో నటించిన ఏకైక చిత్రం వీరభద్ర. బాలయ్య సరసన ఈ చిత్రంలో తనుశ్రీ నటించింది. 2010 నుంచి తనుశ్రీ సినిమాలకు దూరంగా ఉంటోంది. తనుశ్రీ చేసిన వ్యాఖ్యలు మాత్రం బాలీవుడ్ హాట్ టాపిక్ గా మారుతాయనడంలో సందేహం లేదు.

  English summary
  Tanushree Dutta says she was sexually abused by an actor. Tanushree Dutta says the Me Too movement won’t happen in India
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more