»   » అరుదైన వ్యాధికి గురైన ప్రముఖ నటుడు.... భావోద్వేగమైన ట్వీట్, ఫ్యాన్స్ కంటతడి!

అరుదైన వ్యాధికి గురైన ప్రముఖ నటుడు.... భావోద్వేగమైన ట్వీట్, ఫ్యాన్స్ కంటతడి!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ప్రస్తుతం ఇండియాలోని ప్రముఖ నటుల గురించి మాట్లాడుకుంటే... అందులో టాప్ లిస్టులో ఉండే పేరు ఇర్ఫాన్ ఖాన్. విలక్షణమైన నటన, విభిన్నమైన కథలు ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్ అటు హాలీవుడ్ చిత్రాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతున్నాడు. అయితే తాజాగా ఇర్ఫాన్ ఖాన్ గురించిన ఓ వార్త అభిమానులను ఆందోళనలో పడేసింది.

  ఆ వార్తలు ప్రచారంలోకి రావడంతో

  ఆ వార్తలు ప్రచారంలోకి రావడంతో

  ఆయన అరుదైన వ్యాధితో బాధ పడుతున్నారని, అత్యంత రేర్‌గా వచ్చే, ప్రమాదకరమైన ఒక రకమైన జాండిస్ ఇన్స్ఫెక్షన్‌కు గురైనట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో ఆయన అభిమానుల్లో ఆందోళన తీవ్రతరం అయింది. కొందురు ఈ విషయం తెలిసి భావోద్వాగినికి గురై కంటతడి పెట్టారు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

  గత 15 రోజులుగా నా జీవితం....

  గత 15 రోజులుగా నా జీవితం....

  కొన్ని సందర్భాల్లో జీవితం తలక్రిందులు అవుతుందనే విషయం తెలిసి వణికిపోతూ నిద్ర లేవాల్సి వస్తోంది. గత 15 రోజులుగా నా పరిస్థితి అలాగే ఉంది. నా లైఫ్ ఒక సస్పెన్స్ కథలా తయారైంది.... అంటూ ఇర్ఫాన్ ఖాన్ వెల్లడించారు.

   నాకు అరుదైన వ్యాధి సోకింది

  నాకు అరుదైన వ్యాధి సోకింది

  నేను ఎక్కువగా అరుదైన కథల కోసం వెతుకుతూ ఉంటాను. అందుకేనేమో నన్ను వెతుక్కుంటూ అరుదైన వ్యాధి వచ్చింది..... అంటూ అసలు విషయాన్ని బయట పెట్టారు ఇర్ఫాన్ ఖాన్.

   సవాళ్లను వదిలిపెట్టను

  సవాళ్లను వదిలిపెట్టను

  నేను ఎప్పుడూ సవాళ్లను వదిలిపెట్టను. నా శక్తిమేర పోరాటం చేస్తూనే ఉంటాను. ఈ అరుదైన వ్యాధి విషయంలో కూడా పోరాడుతూనే ఉంటాను. దాని నుండి బయట పడటానికి పయత్నిస్తూనే ఉంటాను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండగా ఉన్నారు.... అని ఇర్ఫాన్ ఖాన్ తెలిపారు.

  వదంతులు వద్దు, పది రోజుల్లో నేనే చెబుతా

  వదంతులు వద్దు, పది రోజుల్లో నేనే చెబుతా

  ఈ విషయంలో దయచేసి వదంతులు వ్యాప్తి చేయవద్దు. ప్రస్తుతం డాక్టర్లు వివిధ రకాల టెస్టులు చేస్తున్నారు. వ్యాది నిర్దారణ అయ్యాక మరో వారం పది రోజుల్లో పూర్తి వివరాలు నేనే బయట పెడతాను. అంత వరకు ఓపిక పట్టండి, అంతా మంచి జరుగాలని కోరుకుందాం... అని ఇర్ఫాన్ ఖాన్ తెలిపారు.

   ఆగిన షూటింగ్, బ్లాక్ మెయిల్ ప్రమోషన్లకు దూరం

  ఆగిన షూటింగ్, బ్లాక్ మెయిల్ ప్రమోషన్లకు దూరం

  ఇర్ఫాన్ ఖాన్ జబ్బు పడటంతో ఆయన నటిస్తున్న అమేజాన్ ప్రైవ్ సిరీస్ షూటింగ్ ఆగిపోయింది. త్వరలో విడుదల కాబోతున్న ‘బ్లాక్ మెయిల్' మూవీ ప్రమోషన్లకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.

   కోలుకోవాలంటూ ప్రముఖుల ట్వీట్లు

  కోలుకోవాలంటూ ప్రముఖుల ట్వీట్లు

  ఇర్ఫాన్ ఖాన్ వ్యాధి విషయం తెలుసుకున్న అభిషేక్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, సునీల్ శెట్టి తదితరులు ట్విట్టర్ ద్వారా ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ చేశారు.

  English summary
  “Sometimes you wake up with a jolt with life shaking you up. The last fifteen days, my life has been a suspense story. Little had I known that my search for rare stories would make me find a rare disease. I have never given up and have always fought for my choices and always will. My family and friends are with me and we are working it out the best way possible. In trying times, please don't speculate as I will myself share with you my story within a week - ten days, when the further investigations come with a conclusive diagnosis. Till then, wish the best for me.” Irrfan Khan tweeted.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more