twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేశంలోనే అతిపెద్ద ఫ్లాప్.. కానీ రూ.125 కోట్ల లాభం.. అది స్టామినా అంటే..

    |

    బాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో అతిపెద్ద పరాజయం పాలైన చిత్రమేమిటంటే అది థగ్స్ ఆఫ్ హిందూస్థాన్. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. బాలీవుడ్ సూపర్‌స్టార్లు అమితాబ్ బచ్చన్, మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా సినిమాను కాపాడలేకపోయారు. దాంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన వారంతా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. కానీ నిర్మాతకు భారీ లాభాన్ని తెచ్చిపెట్టింది. అదెలా అంటే వివరాల్లోకి వెళ్దాం.

    రూ.240 కోట్ల బడ్జెట్‌తో

    రూ.240 కోట్ల బడ్జెట్‌తో

    భారత స్వాతంత్రానికి పూర్వం కథతో తెరకెక్కిన ఈ చిత్ర బడ్జెట్ రూ.240 కోట్లు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ తెరకెక్కించింది. ధూమ్ చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. అయితే కథ, కథనాలు ప్రేక్షకులను ఆకర్షించలేకపోవడంతో పెద్దగా రెస్పాన్స్ రాలేదు.

    అమీర్ ఖాన్‌కు చైనా ప్రేక్షకుల ఝలక్... అక్కడ కూడా అదే రిపీట్!అమీర్ ఖాన్‌కు చైనా ప్రేక్షకుల ఝలక్... అక్కడ కూడా అదే రిపీట్!

     రూ.100 కోట్ల షేర్

    రూ.100 కోట్ల షేర్

    థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ భారీ అంచనాల మధ్య రిలీజైంది. తొలిరోజే రూ.40 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. విమర్శకులు ప్రతికూలంగా స్పందించడంతో ఈ సినిమా కలెక్షన్లు భారీగా పడిపోయాయి. చివరకు రూ.100 కోట్ల షేర్ సంపాదించింది.

    శాటిలైట్, డిజిటల్‌ రూపంలో

    శాటిలైట్, డిజిటల్‌ రూపంలో

    థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ డిజిటల్, శాటిలైట్ హక్కులను భారీ ధరకు అమ్మడం జరిగింది. ఈ హక్కుల ద్వారా రూ.140 కోట్లు రాబట్టింది. అదే సమయంలో మ్యూజిక్ రైట్స్ ద్వారా రూ.15 కోట్లు వసూలయ్యాయి. దాంతో పెట్టిన పెట్టుబడి వచ్చేసింది.

    చైనాలో 110 కోట్ల షేర్

    చైనాలో 110 కోట్ల షేర్

    ఆ తర్వాత చైనాలో రిలీజ్ చేయగా అక్కడ కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ రూ.110 కోట్ల షేర్ వచ్చింది. దాంతో ఈ చితానికి రూ.125 కోట్లకుపైగా లాభం వచ్చినట్లయింది. మిస్టర్ ఫర్‌ఫెక్ట్ సినిమా పెద్దగా ఆడకపోయినా యష్ రాజ్ ఫిలింస్‌కు భారీ లాభమే మిగిలింది.

    English summary
    Thugs Of Hindostan movie is biggest flop in indian film history. It collects poor numbers. But end of the It went good profits. The movie affairs closed with Rs.125 crores profit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X