Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu :ఈ రాశుల వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి...!
- News
అన్నెం సాయిపై మరో కేసు నమోదు..
- Sports
ఆర్సీబీ పాలిట హిట్లర్‌లా మారిన బట్లర్.. సెంచరీతో రాజస్థాన్‌ను సగర్వంగా ఫైనల్‌కు తీసుకెళ్లాడు
- Finance
వేతనం పెరిగిందా, అయితే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి
- Technology
ఇండియాలో లాంచ్ అయ్యే ఒప్పో A57 & A57s 4G ఫోన్ల ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి
- Automobiles
పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Sushant Singh Rajput మరణం కేసులో మరో ట్విస్టు.. పోస్ట్ మార్టమ్ రిపోర్టుల్లో ఘోరం అంటూ..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. సుశాంత్ సింగ్ మరణించి రెండేళ్లు కావొస్తున్న సుశాంత్ మరణానికి సంబంధించిన విషాదం అందర్ని వెంటాడుతూనే ఉంది. అయితే సుశాంత్ మరణంపై అనేకు అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే సుశాంత్ మరణానికి సంబంధించి తాజాగా చోటు చేసుకొన్న మరో ట్విస్టు ఏమిటంటే?

టెలివిజన్ రంగం నుంచి
ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. టెలివిజన్ రంగం ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి వరుస విజయాలు సాధించారు. స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే సుశాంత్‌ను బాలీవుడ్‌లోని కొన్ని వర్గాలు అణగదొక్కేందుకు ప్రయత్నించారనే వార్తలు షాక్ గురిచేశాయి.

అంకిత లోఖండేతో బ్రేకప్.. రియా చక్రవర్తితో డేటింగ్
ఇలాంటి పరిస్థితు మధ్య తన టెలివిజన్ సీరియల్‌లో సీరియల్ నటి అంకితా లోఖండేతో అఫైర్ బ్రేకప్ కావడం, ఆ తర్వాత బాలీవుడ్ యువ హీరోయిన్ రియా చక్రవర్తితో డేటింగ్, సహజీవనం జరుగుతూ వచ్చింది. లాక్‌డౌన్‌కు ముందు ప్రారంభమైన సహజీవనంతో ఇద్దరు కలిసి మెలిసి జీవించారు. అయితే సుశాంత్ మరణానికి కొద్ది రోజుల ముందు రియాతో జరిగిన గొడవలపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.

జూన్ 14వ తేదీన ముంబైలో మరణం
సుశాంత్ సింగ్ అనుమానాస్పద పరిస్థితుల్లో 2020 జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రాలో మరణించడం అనేక సందేహాలకు దారి తీసింది. అప్పటి నుంచి సుశాంత్ కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తున్నది. సుశాంత్ పోస్ట్ మార్టమ్ నిర్వహించిన కూపర్ హాస్పిటల్ వైద్య నిపుణులు, రిపోర్టులపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు పర్యవేక్షణలోకి వెళ్లింది. అనంతరం ఈ కేసులో వాస్తవాలను వెలికి తీయడానికి సీబీఐకి కూడా అప్పగించడం తెలిసిందే.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ట్విస్ట్
సీబీఐ
విచారణ
జరుగుతున్న
సమయంలో
సుశాంత్
సింగ్
రాజ్‌పుత్
కేసులో
మరో
ట్విస్టు
చోటుచేసుకొన్నది.
సుశాంత్
పోస్టుమార్టమ్
సమయంలో
వైద్యపరమైన
లోపాలు,
నిర్లక్ష్యం
కొట్టొచ్చినట్టు
కనిపిస్తున్నది.
ఈ
విషయంలో
నిజాల
నిగ్గు
తేల్చాలి.
ఈ
కేసులో
జరిగిన
అవకతవకలను
విచారించాలని
జాతీయ
మానవ
హక్కుల
కమిషన్‌లో
ఆశీష్
రాయ్
అనే
అడ్వకేట్
కేసు
నమోదు
చేయడం
సంచలనంగా
మారింది.

కూపర్ హాస్పిటల్, ముంబై పోలీసులపై కేసు
జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో కూపర్ హాస్పిటల్‌పై కేసు దాఖలు చేసిన అనంతరం ఆశీష్ రాయ్ మాట్లాడుతూ.. 1275/IN/2022 నెంబర్ కింద కేసు దాఖలైంది. ముంబై పోలీసుల తీరు, కూపర్ హాస్పిటల్ డాక్టర్ ప్యానెల్‌ను విచారించాలి. పోస్ట్ మార్టమ్ సమయంలో అనేక అవకతవకలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తాయి అని కోరాను అని తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించగా.. వాళ్లు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

సుశాంత్ తండ్రికి నిరాశే
ఇదిలా ఉంటే.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కృష్ణ కిషోర్ సింగ్‌కు ఇటీవల ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. తన కుమారుడి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాలపై స్టే విధించాలని సుశాంత్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దాంతో సుశాంత్ తండ్రికి నిరాశే ఎదురైంది. అయితే సుశాంత్ అభిమానులు ఆయన కుటుంబానికి అండగా ఉంటూ వస్తున్నారు.