తల్లిదండ్రులైన మరో బాలీవుడ్ సినీ జంట

ప్రస్తుతం బాలీవుడ్లో వెడ్డింగ్ సీజన్, బేబీస్ సీజన్ నడుస్తున్నట్లు ఉంది. ఇటీవలే నేహా ధూపియా-అంగద్ బేడీ దంపతులు ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ ముద్దుల కూతురికి మెహర్ ధూపియా బేడీ అని పేరు పెట్టారు. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ దంతపులు సైతం అక్టోబర్ 30 మగబిడ్డకు జన్మనిచ్చారు.

తాజాగా ఈ లిస్టులో మరో సినీ జంట కూడా చేరిపోయారు. బాలీవుడ్ నటి ఉదితా గోస్వామి బుధవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఆమె ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఉదితా గోస్వామి బాలీవుడ్ దర్శకుడు మోహిత్ సూరిని పెళ్లాడిన సంగతి తెలిసిందే.

Udita Goswami and Mohit Suri welcome a baby boy

మోహిత్ సూరి దర్శకత్వంలో 2005లో వచ్చిన జహెర్ సినిమాలో నటించిన ఉదితా గోస్వామి ఆ సమయంలోనే అతడితో ప్రేమలో పడ్డారు. కొంతకాలం సహజీవనం చేసిన ఈ ఇద్దరూ. 2013లో వివాహం చేసుకున్నారు.

పెళ్లికి ఒక సంవత్సరం ముందే ఉదితా గోస్వామి సినిమాలకు దూరం అయ్యారు. ఆమె చివరగా 'డైరీ ఆఫ్ బటర్‌ప్లై' సినిమాలో నటించారు. ఉదితా గోస్వామి-మోహిత్ సూరి దంపతులకు ఇద్దరు పిల్లలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X