Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
నిజమైన భారతీయులకు ధన్యవాదాలు.. ఊర్మిళ ట్వీట్ వైరల్
సోషల్ మీడియాలో కంగనా రనౌత్, ఊర్మిళా మటోండ్కర్ మధ్య జరుగుతున్న మాటల యుద్దం గురించి అందరికీ తెలిసిందే. కంగనా ప్రతీసారి అంతే బాధితురాలిగా తనను తాను ప్రకటించుకుంటుందని, సింపతీ క్రియేట్ చేసుకుంటుందని తద్వారా బీజేపీ వారు టికెట్ ఇస్తారని ఆశిస్తుందేమో అని ఊర్మిళ కామెంట్స్ చేసింది. ఇక ఆ కామెంట్లకు కంగనా రెచ్చిపోయింది. ఓ రేంజ్‌లో ఊర్మిళపై విరుచుకుపడింది. లైవ్‌లోనే మాట్లాడుతూ సాప్ట్ పోర్న్ స్టార్ అంటూ కామెంట్స్ చేసింది.
ఊర్మిళ వ్యాఖ్యలపై కంగన స్పందిస్తూ.. నా వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. నేను బీజేపీ టికెట్ కోసం ఆశిస్తున్నానని ఆరోపణలు చేశారు. ఓ పోర్న్‌స్టార్ టికెట్ సాధించగలిగితే.. మరాఠా సంస్కృతిని చాటేలా సినిమాలు తీసిన నాకు టికెట్ ఇవ్వరా అంటూ కంగన ఘాటుగా స్పందించారు. ఊర్మిళను పరుష పదజాలంతో దూషించడంతో కంగనాకు పెద్ద దెబ్బ తగిలింది. అందరూ ఊర్మిళనే సపోర్ట్ చేశారు. సోషల్ మీడియాలో కంగనాపై నెగెటివిటీ పెరిగింది.

కంగనా అలా మాట్లాడినందుకు, నిజాయితీ, నిష్పక్షిపాతంగా వ్యవహరించి తనకు సపోర్ట్‌గా నిలిచిన వారందరికీ ఊర్మిళ థ్యాంక్స్ తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేస్తూ..'నాకు మద్దతుగా నిలిచినందుకు నిజమైన భారత ప్రజలకు, నిష్పాక్షికంగా, గౌరవప్రదంగా మెలిగిన మీడియాకు ధన్యవాదాలు. కావాలనే చేసే దుష్ప్రచారంపై మీరు సాధించిన విజయం ఇది. నేను మీ ప్రేమకు ముగ్గురాలిని అయిపోయాను.. ఎంతో గొప్పగా ఫీలవుతున్నాను' అని ట్వీట్ చేసింది.