Just In
- 53 min ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 1 hr ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 1 hr ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- 1 hr ago
రొమాన్స్‌లో మునిగితేలారు.. అది అలవాటుగా కాదట.. భర్త ఒళ్లో వాలిన పూజా రామచంద్రన్
Don't Miss!
- News
ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం
- Sports
IPL 2021: చెన్నై జట్టులోకి రాబిన్ ఊతప్ప.. మీరు మారరంటూ ఫ్యాన్స్ ఫైర్!
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్లేస్ నువ్వే చెప్పు.. ఎక్కడికంటే అక్కడికి వస్తా... కంగన రనౌత్‌కు ఊర్మిళ దిమ్మతిరిగే షాక్
బాలీవుడ్ హీరోయిన్లు కంగన రనౌత్, ఊర్మిళ మతోంద్కర్ మధ్య మరోసారి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదం నెలకొన్నది. ఇటీవల ఊర్మిల కొనుగోలు చేసిన ఆస్తులపై కంగన రనౌత్ చేసిన ట్వీట్ అత్యంత గొడవకు దారి తీసింది. శివసేనలో చేరిన తర్వాతే ఊర్మిళ ఇంటిని కొనుగోలు చేశారనే ట్వీట్‌పై కంగనకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ వివాదంలోకి వెళితే..

3 కోట్ల విలువైన బంగ్లా కొనుగోలు
ఇటీవల ముంబైలో 3 కోట్ల విలువైన బంగ్లాను కొత్త ఆఫీస్ కోసం ఊర్మిల కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. శివసేనలో చేరిన తర్వాత 3 కోట్ల రూపాయల విలువైన ఇంటిని కొనుగోలు చేశావనే విధంగా కంగన తన వాదనను వినిపించింది. ఆ క్రమంలో ఊర్మిలను ఉద్దేశించి కంగన రనౌత్ ట్వీట్ చేసింది.

నీలాగా ఖుషీ చేసినట్లయితే
కంగన రనౌత్ ట్వీట్ చేస్తూ.. ఊర్మిళ గారు.. నా కష్టార్జితంతో సంపాదించిన ఇంటిని కాంగ్రెస్ పార్టీ కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నది. బీజేపీ వైపు ఉండటం వల్ల నేను సుమారు 30 కేసులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. నేను కూడా మీ మాదిరిగా కాంగ్రెస్‌ను ఖుషీ చేసినట్లయితే.. నాకు లబ్ది చేకూరేది. నేను ఎంత చెత్తగా ఆలోచిస్తున్నానో అర్ధం కావడం లేదు. అంటూ కంగన ట్వీట్ చేసింది.

నా ఆస్తుల డాక్యుమెంట్లు పట్టుకొని వస్తాను..
కంగన చేసిన ట్వీట్‌పై ఊర్మిళ ఘాటుగా స్పందిస్తూ.. నీ ఇష్టప్రకారం.. నీకు నచ్చిన చోట మీటింగ్ ఏర్పాటు చేయి. ఆఫీస్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు పట్టుకొని వస్తాను. వాటికి సంబంధించిన ఆధారాలు పక్కగా నీ ముందు ఉంచుతాను. 25 ఏళ్లు ఇండస్ట్రీలో కష్టపడి 2011లో ఆ ఇంటిని కొనుగోలు చేశాను. మార్చిలో నా ఆస్తిని అమ్మడం ద్వారా వచ్చిన మొత్తంతో ఆఫీస్ కోసం భవనాన్ని కొనుగోలు చేశాను. నేను రాజకీయాల్లోకి రాకముందే సంపాదించాను అంటూ ఊర్మిళ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

డ్రగ్స్ జాబితా బయటపెట్టు అంటూ ఊర్మిల సవాల్
అంతకాకుండా ప్రజలు కట్టిన కోట్లాది పన్నుల ద్వారా నీవు వై క్యాటగిరీ భద్రతను ఎంజాయ్ చేస్తున్నావు. అలాగే బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయనే జాబితా తన వద్ద ఉన్నదని చెప్పింది. ఆ జాబితాను వెంటనే బయటపెట్టాలి. వీడియో ద్వారా నేను వేస్తున్న ప్రశ్నలకు కంగన రనౌత్ నుంచి సమాధానం కోసం వేచి చూస్తుంటాను అని ఊర్మిళ ఘాటుగా స్పందించింది.