Don't Miss!
- Sports
INDvsAUS : భారత్‌తో టెస్టు సిరీస్ ముందు.. బెంగళూరులో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ సెషన్స్
- News
హైదరాబాద్‌లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' అనే సినిమాతో బాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు వరుణ్ ధావన్. బడా డైరెక్టర్ డేవిడ్ ధావన్ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. మొదటి చిత్రంతోనే అద్భుతమైన యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో వరుసగా ఆఫర్లు అందుకుంటూ ముందుకు సాగాడు. ఇలా కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో తన చిన్ననాటి స్నేహితురాలితో వివాహానికి సిద్ధం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి వరుణ్ పెళ్లి ఘనంగా జరిగింది. అయితే, అక్కడ సీసీ కెమెరాలు కూడా తీసేయడం చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాలు మీకోసం!
Recommended Video

సినిమాల్లోకి రాకముందే ప్రేమ
ప్రస్తుతం బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో వరుణ్ ధావన్ ఒకడు. కొన్నేళ్లుగా అతడు వరుస విజయాలతో దూసుకుపోతోన్నాడు. ఇదిలా ఉండగా, అతడు సినిమాల్లోకి రాకముందు నుంచే చిన్ననాటి స్నేహితురాలైన నటాషా దలాల్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఆమె ముంబైలో ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తోంది. వరుణ్ చేసిన చాలా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ వ్యవహరించింది.

రెండు రోజుల పాటు సందడిగా
తన ప్రియురాలు నటాషా దలాల్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వరుణ్ ధావన్ డైరెక్టుగా ప్రకటించలేదు. కానీ, అప్పుడప్పుడు కలిసి కనిపిస్తుండడంతో వీళ్లిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారని బీ టౌన్‌లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా వీళ్ల పెళ్లి మేటర్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ముంబైలోని మ్యాన్షన్ హౌస్ అనే హోటల్‌లో రెండు రోజులు వీళ్ల పెళ్లి పనులు జరిగాయి.

రాత్రి ఘనంగా జరిగిన వివాహం
బాలీవుడ్
స్టార్
హీరో
వరుణ్
ధావన్
-
నటాషా
దలాల్
పెళ్లి
ఆదివారం
రాత్రి
ఘనంగా
జరిగింది.
హిందూ
సంప్రదాయం
ప్రకారమే
ఈ
పెళ్లి
జరిగింది.
ఇందులో
భాగంగానే
పెద్దలు
ఖరారు
చేసిన
ముహూర్తానికి
హీరో
తన
ప్రియురాలి
మెడలో
మూడు
ముళ్లు
వేశాడు.
ఈ
వేడుకకు
ముంబై
నగరంలోని
మ్యాన్షన్
హౌస్
అనే
హోటల్
వేదికైంది.
కొత్త
జంటను
సినీ
ప్రముఖులంతా
విష్
చేస్తున్నారు.

ఇండస్ట్రీ నుంచి ఒక్కరు.. వాళ్లు
కరోనా నేపథ్యంలో వరుణ్ ధావన్ - నటాషా దలాల్ పెళ్లి కేవలం 50 మంది అతిథుల సమక్ష్యంలోనే జరిగింది. దీనికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువులతో పాటు ఒకరిద్దరు గెస్టులు వచ్చారు. ఇక, బాలీవుడ్ నుంచి దర్శక నిర్మాత కరణ్ జోహార్ మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ఇక, హీరో స్నేహితులు దీపిక పదుకొనే, నేహా దూపియా తదితరులు లైవ్‌లో దీన్ని వీక్షించారు.

సీసీ కెమెరాలు తీసేసి రహస్యంగా
ఇక, వరుణ్ ధావన్ - నటాషా దలాల్ పెళ్లి అత్యంత రహస్యంగా జరిగింది. పెళ్లికి హాజరైన వాళ్లెవరూ తమ ఫోన్లను తీసుకు రావద్దని ముందు చెప్పారు. అందుకు అనుగుణంగానే ఎవరూ తమ మొబైళ్లను లోపలికి తీసుకెళ్లలేదు. అలాగే, ఈ వేడుక కోసం హోటల్‌లోని సీసీ కెమెరాలను కూడా ఆఫ్ చేసేశారు. ఈ పెళ్లి ఇంత రహస్యంగా చేయడంపై పలు కామెంట్లు వినిపిస్తున్నాయి.