Just In
- 8 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 9 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 10 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
- 10 hrs ago
దానికి సరైన సమయమిదే అంటోన్న సునీత.. పెళ్లయ్యాక పూర్తిగా మారినట్టుందే!!
Don't Miss!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- News
జో బైడెన్ రాకముందే డొనాల్ ట్రంప్ జంప్: కరోనా, నిరుద్యోగితలే అధ్యక్ష భవనానికి దూరం నెట్టాయి
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విద్యాబాలన్ సినిమా.. పర్మిషన్ కోసం అడిగితే రాత్రికి సెట్ చేయమని కండిషన్
బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక న్యూస్ వైరల్ గా మారింది. హీరోయిన్ ని రమ్మన్నాడు అంటూ ఏకంగా మంత్రిపైనే కొన్ని కథనాలు వైరల్ గా మారాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా రూమర్స్ వైరల్ అవ్వడంతో చివరకు ఆ ఆ మంత్రి కూడా క్లారిటీ ఇచ్చాడు. అయితే అప్పటికి జరగాల్సిందంతా జరిగిపోయింది. ఒక్క రాత్రిలోనే విద్యాబాలన్ సినిమా షూటింగ్ కి సంబంధించిన న్యూస్, ట్రెండ్ లిస్ట్ లోకి వెళ్లిపోయింది. ఈ విషయంలో ఎన్నో రకాల అనుమానాలు కూడా వస్తున్నాయి. అసలు ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

బాలీవుడ్ లోనే కాకుండా..
బాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిమణుల్లో ఒకరైన విద్యా బాలన్ ప్రస్తుతం తనకు సెట్టయ్యే సినిమాలను ఎంచుకుంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని క్రియేట్ చేసుకుంది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా మంచి అవకాశాలు వస్తే మొహమాటం లేకుండా నటిస్తోంది. వీలైనంత వరకు ప్రయోగాత్మక కథలలలోనే నటిస్తోంది ఈ సీనియర్ నటి. ఒక విదంగా ఆమె హీరోయిన్ గా ఉన్నప్పటికీ కంటే ఇప్పుడే ఎక్కువ రేంజ్ లో పారితోషికాన్ని కూడా అందుకుంటోంది.

విద్యా బాలన్ సినిమాకు పర్మిషన్ క్యాన్సిల్
ఇక ఆమె ప్రస్తుతం షేర్ని అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో కూడా విద్యా బాలన్ నెవర్ బిఫోర్ అనే పాత్రలో కనిపించనుందట. ఆమె ఆ సినిమాలో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించబోతోంది. పూర్తిగా అడవుల సంక్షేమానికి సంబంధించిన పాయింట్ తోనే సినిమాను రూపొందిస్తున్నారట. ఇక మధ్యప్రదేశ్ అడవులలో సినిమా షూటింగ్ కోసం కొన్ని లొకేషన్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోగా చివరి నిమిషంలో పర్మిషన్ ను క్యాన్సిల్ చేశారని టాక్ వచ్చింది.

డిన్నర్ సెట్ చేస్తేనే షూటింగ్ కు అనుమతి
అయితే సినిమా షూటింగ్ కోసం మధ్యప్రదేశ్ అటవీ శాఖ మంత్రిని విజయ్ షాను కలిశారు చిత్ర నిర్మాతలు. అందుకు ఆయన కూడా ఒప్పుకున్నారట. కానీ అందులో ఒక కండిషన్ పెట్టినట్లు రూమర్స్ వచ్చాయి. నటిమణి విద్యా బలన్ కు అలాగే తనకు నైట్ డిన్నర్ ప్లాన్ చేయాలని చెప్పారట. ఇది ఎంతవరకు నిజమో అనే విషయంలో క్లారిటీ రాకముందే ఆ వార్త సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యింది.

కావాలనే అలా చేశారట
అలాగే చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కావాలనే. క్యాన్సిల్ చేయించారని కూడా కామెంట్స్ వచ్చాయి. విద్యా బాలన్ కూడా ఆ విషయంలో సీరియస్ అయినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఫైనల్ గా మంత్రి విజయ్ షా ఆ రూమర్స్ అబద్దాలని కొట్టి పారేశారు. అసలు విషయం ఇదేనని ఒక వివరణ ఇచ్చారు.

వాళ్లే నన్ను రమ్మన్నారు.. మంత్రి రివర్స్ కౌంటర్
అందులో ఎలాంటి నిజం లేదు. చిత్ర యూనిట్ సభ్యులే నన్ను విందుకు పిలిచారు. కానీ నేను బిజీగా ఉండడం వలన అది కుదరలేదు. విద్యా బాలన్ ను డిన్నర్ కు పిలిచినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ.. మంత్రి ధీమాగా వివరణ ఇచ్చారు. అయితే ఈ రూమర్స్ గురించి చిత్ర యూనిస్ సభ్యులు పెద్దగా వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. మరీ విద్యా బాలన్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.