Aishwarya Rai అఫైర్‌లో చిచ్చు.. సల్మాన్ ఖాన్‌తో రాసలీలలు.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే?
బాలీవుడ్‌లో అఫైర్లు, డేటింగ్స్, బ్రేకప్స్ చాలా సాధారణంగా జరిగిపోతుంటాయి. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, అనైతిక సంబంధాలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. అలా మీడియాలో సుదీర్ఘకాలం కొనసాగిన ప్రేమ వ్యవహారం విషయానికి వస్తే.. ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్ మధ్య అఫైర్ మీడియాలో ప్రధానంగా కనిపించాయి. అయితే సల్మాన్ ఖాన్, ఐశ్వర్య మధ్య బ్రేకప్ జరగడానికి కారణం.. ప్రీతీ జింటా అనే విషయం ఊహించని పరిణామంగా అప్పట్లో మారింది. అయితే సల్మాన్ ఖాన్‌తో ప్రీతి జింటా రాసలీలలే అందుకు కారణమనే విషయంలోకి వెళితే..

ప్రీతి జింటా బాలీవుడ్ ఎంట్రీ
బాలీవుడ్‌లో రాంగోపాల్ వర్మ, శేఖర్ కపూర్, మణిరత్నం నిర్మించిన దిల్ సే సినిమా ద్వారా ప్రీతీ జింటా ఎంట్రీ ఇచ్చింది. ఆర్మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో వచ్చిన ఆమె తొలి సినిమాలోనే షారుక్ ఖాన్, మనీషా కోయిరాలా లాంటి స్టార్ హీరో, హీరోయిన్లతో నటించింది. దిల్ సే సినిమా తర్వాత ప్రీతీ జింటా కెరీర్‌లో వెనుకకు చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. హిందీలో అగ్రహీరోల సరసన అవకాశాలు లభించాయి.

తెలుగులో ప్రేమించుకొందాం రా అంటూ
దిల్ సే సినిమా తర్వాత వరుసగా తెలుగు, హిందీలో అవకాశాలు వచ్చాయి. తెలుగులో ప్రేమించుకొందాం రా సినిమాలో వెంకటేష్‌తో కలిసి నటించింది. ఆ తర్వాత కల్ హో నా హో, వీర్ జరా, లక్ష్య, సలాం నమస్తే, సంఘర్ష్, కోయి మిల్ గయా, క్యా కహనా, కభీ అల్విదా నా కహనా, చోరీ చోరి చుప్కే చుప్కే, ది లాస్ట్ లీర్, సోల్జర్ లాంటి చిత్రాల్లో నటించింది.

సల్మాన్ ఖాన్‌తో ప్రీతి జింటా అఫైర్
చోరి చోరి చుప్కె చుప్కే సినిమాలో నటిస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్‌కు చాలా సన్నిహితంగా మెదిలింది. అప్పటికే ఐశ్వర్యరాయ్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సల్మాన్ ఖాన్‌కు మరింత క్లోజ్ అయింది. అయితే సల్మాన్, ప్రీతీ జింటా మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ఐశ్వర్య రాయ్‌ను గందరగోళానికి గురిచేసింది. అప్పటి వరకు ఎలాంటి సమస్యలు లేని ఐశ్వర్య, సల్మాన్ అఫైర్‌లో ప్రీతీ జింటా కారణంగా చిచ్చు మొదలైంది.

సల్మాన్, ఐశ్వర్య రాయ్ బ్రేకప్‌కు
ప్రీతి జింటాతో అఫైర్ గురించి సల్మాన్ ఖాన్‌కు ఐశ్వర్య రాయ్‌కి మధ్య భారీ యుద్దమే జరిగింది. ఓ సందర్భంలో సల్మాన్, ఐశ్వర్యరాయ్ ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో టేప్ లీక్ కావడంతో ప్రీతీ జింటా బండారం బయటపడింది. ఐశ్వర్య రాయ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ.. ప్రీతి జింటాతో తాను పడుకొన్నాను. ఆమెతో పడకగదిలో రాసలీలలు జరిపానని సల్మాన్ ఒప్పుకోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది.

సల్మాన్ ఖాన్ ఆడియో టేప్ లీక్‌తో
ఐశ్వర్యరాయ్, సల్మాన్ మధ్య జరిగిన ఆడియో సంభాషణ లీక్ కావడంతో సినీ పరిశ్రమనే కాకుండా మీడియా కూడా షాక్‌కు గురైంది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్‌కు ఐశ్వర్యరాయ్ గుడ్‌బై చెప్పింది. పెళ్లి చేసుకొందామని అనుకొనే సమయంలో సల్మాన్, ఐశ్వర్య రిలేషన్‌షిప్ బ్రేకప్ కావడానికి ప్రీతీ జింటానే కారణమని చెప్పుకొంటారు.

విదేశీయుడితో ప్రీతి జింటా ప్రేమ, పెళ్లి
అయితే పలు వివాదాల్లోను, అలాగే అఫైర్లతో ముడిపెడుతూ ప్రీతి జింటా పేరు వినిపించింది. చివరకు జీన్ గుడ్ఎనఫ్ అనే విదేశీయుడిని ప్రీతీ జింటా పెళ్లి చేసుకొన్నది. వారిద్దరి వివాహం 2016 ఫిబ్రవరి 29న జరిగింది. ప్రీతి, గుడ్ ఎనఫ్‌కు జై, జియా అనే ఇద్దరు కవలపిల్లలు 2021 నవంబర్ 11వ తేదీన పుట్టడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











