twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    1 నేనొక్కడినే కలెక్షన్స్ : ‘ఎవడు’ను దాటేసింది

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' చిత్రం జనవరి 10న విడుదలై యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తోంది. ఫస్ట్ వీకెండ్‌ పూర్తయ్యే నాటికి ఎవడు, డేడ్ఇష్కియా(హిందీ), వీరమ్(తమిళం), జిల్లా(తమిళం) చిత్రాల కంటే సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ '1' ఎక్కువ వసూళ్లు సాధించింది. అయితే ఇంతకు ముందు వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అత్తారింటికి దారేది' చిత్రాల 3డేస్ కలెక్షన్ రికార్డులను బద్దలు కొట్టడంలో మాత్రం ఈ చిత్రం విఫలమైంది.

    మహేష్ బాబు ఇంతకు ముందు నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం అప్పట్లో యూఎస్ఏలో 69 స్క్రీన్లలో విడుదలై ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే నాటికి రూ. 6.87 కోట్లు ($12,62,100) వసూలు చేసింది. మహేష్ బాబు నటించిన సినిమాల్లో ఇప్పటి వరకు ఇదే టాప్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం 94 స్క్రీన్లలో విడుదలై ఫస్ట్ వీకెండ్ నాటికి రూ. 9.53 కోట్లు ($15,22,734) వసూలు చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

    '1 నేనొక్కడినే' చిత్రం యూఎస్ఏ వ్యాప్తంగా 110కి పైగా స్ర్కీన్లలో విడుదల చేసారు. ఈ నేపత్యంలో ఈ చిత్రం వసూళ్ల పరంగా అన్ని రికార్డులను తుడిచేస్తుందని భావించారు. అయితే బ్యాడ్ మౌత్ టాక్ కారణంగా ఈ చిత్రం అనుకున్న అంచనాలను అందుకోలేక పోయింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే నాటికి ఈచిత్రం రూ. 5.82 కోట్లు ($946,552) మాత్రమే వసూలు చేసింది. యూఎస్ఏ‌లో శనివారం విడుదలైన రామ్ చరణ్ తేజ్ 'ఎవడు' చిత్రం 70 స్క్రీన్లలో ప్రదర్శితం అయి ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే నాటికి రెండు రోజుల్లో రూ. 1.46 కోట్లు ($237,170) వసూలు చేసింది.

    ఇక తమిళ చిత్రాలు వీరమ్, జిల్లా, హిందీ చిత్రం డేఢ్ ఇష్కియా చిత్రాలు ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే నాటికి రూ. 1.24 కోట్లు(67 స్క్రీన్ల నుండి $201,101), రూ. 1.19 కోట్లు(69 స్క్రీన్ల నుండి $192,858), రూ. 96.82 (50 స్క్రీన్ల నుండి $157,541) వసూలు చేసాయి.

    కొన్నిసీన్లకు కోత

    కొన్నిసీన్లకు కోత

    సినిమాలో చాలా బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయని పలువురు సినీ గోయర్స్ విమర్శించడంతో....వెంటనే నిర్మాతలు నివారణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సినిమాలోని బోరింగ్ సన్నివేశాలు తొలగించి 20 నిమిషాల నిడివి తగ్గించారు.

    సుకుమార్ ఫిక్సయ్యాడు

    సుకుమార్ ఫిక్సయ్యాడు

    టెక్నికల్‌గా సినిమా హాలీవుడ్ సినిమాల స్ధాయిలో హై స్టాండర్డ్స్‌లో ఉండాలని సుకుమార్ ఫిక్సై తీసాడని మొదటి ఫ్రేమ్ నుంచే అర్దమవుతుంది.

    హాలీవుడ్ రేంజి

    హాలీవుడ్ రేంజి

    అయితే టెక్నికల్ వ్యాల్యూస్ తెలిసిన వారు మాత్రం....ఇది ప్యూర్ టెక్నికల్ ఫిల్మ్, మూస తెలుగు సినిమాల్లా కాకుండా డిపరెంట్ జానర్లో దర్శకుడు తెరకెక్కించాడు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రేంజిలో ఉందని అంటున్నారు.

     గౌతం

    గౌతం

    సుకుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో క్రితి సానన్ హీరోయిన్‌గా నటించింది. మహేష్ తనయుడు గౌతం కృష్ణ ఈ చిత్రంతో బాల నటుడిగా తెరంగ్రేటం చేసాడు.

    14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్

    14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్

    14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకరలు ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ అనే బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ కూడా ఈచిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంది.

    English summary
    Mahesh Babu's 1: Nenokkadine, which hit the screens on January 10, has embarked on a glorious start in America and has done fabulous collection at the USA Box Office in the first weekend, beating the Yevadu, Dedh Ishqiya, Veeram and Jilla. But the Sukumar-directed psychological action thriller has failed to smash the three-day business record of Prince last release Seethamma Vakitlo Sirimalle Chettu and Attarintiki Daredi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X