For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  10 Years For Kandireega: రామ్ బాక్సాఫీస్ రేంజ్ ను పెంచిన సినిమా.. రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరంటే?

  |

  చాక్లెట్ బాయ్ గా ఒకప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నా రామ్ పోతినేని ప్రస్తుతం ఉస్తాద్ ట్యాగ్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అతని కెరీర్లో సక్సెస్ కంటే కూడా అపజయాలు ఎక్కువగా పలకరించాయి. ఒకనొక సమయంలో దాదాపు మూడేళ్ళ వరకు సరైన సక్సెస్ చూడని రామ్ కు అప్పట్లో కెరియర్ బెస్ట్ బాక్సాఫీస్ హిట్ ను అందించిన చిత్రం కందిరీగ. ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ఒక విధంగా అనేక రకాల సమస్యలను దాటుకుంటూ వచ్చింది.

  కొంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేయడంతో చివరికి రామ్ వద్దకు చేరింది. తప్పకుండా సినిమా విజయం సాధిస్తుందని కొత్త దర్శకుడిపై రామ్ పెట్టుకున్న నమ్మకమే మంచి విజయాన్ని అందించింది. 2011 ఆగస్టు 12న విడుదలైన ఈ సినిమా ఈ రోజుతో 10 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. సినిమా విశేషాలు పైన ఒక లుక్కేస్తే..

  MS Dhoni తో ఇళయదళపతి విజయ్... సోషల్ మీడియాలో కిరాక్ పుట్టిస్తున్న ఫోటోలు

  వరుసగా ప్లాప్స్..

  వరుసగా ప్లాప్స్..

  రామ్ పోతినేని రెడీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ను మరింత పెంచుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన మస్కా సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. అలాగే గణేష్ సినిమా కూడా అంచనాల స్థాయిని అందుకోలేకపోయింది.

  రామ రామ కృష్ణ కృష్ణ కూడా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఫైనల్ గా కందిరీగ సినిమాతో వచ్చిన రామ్ బాక్స్ ఆఫీసు వద్ద బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అసలు ఈ సినిమా చేయాలా వద్దా అని అనుకుంటున్న సమయంలో దర్శకుడిపై నమ్మకంతో ఓకే చేసి హిట్ అందుకున్నారు.

  రిజెక్ట్ చేసిన స్టార్స్

  రిజెక్ట్ చేసిన స్టార్స్

  ఈ సినిమాకు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అలాగే అనిల్ రావిపూడి రైటర్ గా వర్క్ చేశాడు. హీరోతో పాటు ఆ ఇద్దరికి కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును లభించింది. సినిమా కథ దాదాపు రెండేళ్లపాటు ఇండస్ట్రీలో చాలా మంది హీరోల చుట్టూ తిరిగింది.

  అనిల్ రావిపూడి సంతోష్ శ్రీనివాస్ ఇద్దరు కలిసి అనేకసార్లు కథనంలో మార్పులు చేశారు. మొదట రవితేజతో అనుకోగానే ఆ తర్వాత ఎన్టీఆర్ తో కూడా చేయాలని అనుకున్నారు. కానీ ఇద్దరూ సినిమాపై నమ్మకం చూపలేకపోయారు. రవితేజ ఆల్ మోస్ట్ ఒప్పుకున్నారని అనుకున్న సమయంలో మళ్లీ రిజెక్ట్ చేసినట్లు అప్పట్లో అయితే టాక్ వచ్చింది.

  ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

  ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

  ఎంతమంది హీరోలు రిజెక్ట్ చేసినా కూడా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కందిరీగ సినిమా విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు వీలైనంత వరకు కథను ఎప్పటికప్పుడు సరికొత్తగా మారుస్తూ సెట్స్ పైకి తెచ్చే ప్రయత్నం చేశాడు. ఫైనల్ గా రామ్ పోతినేని అతనిపై నమ్మకం ఉంచాడు. బెల్లంకొండ సురేష్ బాబు ఈ సినిమాను ఎనిమిది కోట్ల బడ్జెట్ తో నిర్మించగా 8.5కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఈ సినిమా మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ఇక బాక్సాఫీసు వద్ద సక్సెస్ అవుతుందా లేదా అని చాలా అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో మొత్తానికి మొదటిరోజే పాజిటివ్ టాక్ ను అందుకుంది.

  బాక్సాఫీస్ కలెక్షన్స్

  బాక్సాఫీస్ కలెక్షన్స్

  ఇక నైజాం ఆంధ్రాలో రెండవ రోజు నుంచి మాస్ ఏరియాల్లో హౌసింగ్ బోర్డులు దర్శనమిచ్చాయి. రామ్ పోతినేని నటనతో పాటు హన్సిక గ్లామర్, అలాగే సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాలో హైలెట్ పాయింట్స్. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి.

  సినిమాలో సోనూసూద్ పాత్ర కూడా బాగా హెల్ప్ అయ్యింది. ఓవైపు విలన్ గా మరోవైపు కామెడీ యాంగిల్ లో నత్థితో మాంచి ఎంటర్టైన్మెంట్ ను క్రియేట్ చేశాడు. అలా విధంగా సోనూసూద్ కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు థమన్ ఇచ్చిన పాటలు అన్నీ కూడా ముందే మంచి బస్ క్రియేట్ చేశాయి. ఇక బాక్సాఫీస్ వద్ద మొత్తంగా ఈ సినిమా 22 కోట్ల వరకు కలెక్ట్ చేసి బయ్యర్లు పెట్టిన పెట్టుబడికి రెండింతల లాభాలను అందించింది.

  బాలీవుడ్ లో రీమేక్..

  బాలీవుడ్ లో రీమేక్..

  ఇక ఈ సినిమాను హిందీలో కూడా డేంజరస్ కిలాడీ అనే పేరుతో రీమేక్ చేశారు వరుణ్ ధావన్ ఆ సినిమాలో హీరోగా నటించాడు. అలాగే మరికొన్ని భాషల్లోకి కూడా రీమేక్ అయ్యింది. ఇక హిందీలో డబ్ చేయగా యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ అందుకుంది. మొత్తానికి కందిరీగ తో హీరో రామ్ ఫామ్ లోకి రావడమే కాకుండా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కు ఆ సినిమా విజయం అనంతరం ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశం దక్కింది. అలాగే రైటర్ అనిల్ కు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్న దర్శకుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

  Ravi Teja Is Going To Act In Teri Movie
  కందిరీగ తరువాత..

  కందిరీగ తరువాత..

  ఇక మరో వైపు హీరో రామ్ పోతినేని కందిరీగ తర్వాత కూడా ఎక్కువగా మాస్ సినిమాల పై ఫోకస్ పెట్టాడు. లవ్ స్టోరీలు మాత్రమే కాకుండా మాస్ సినిమాలతో కూడా తన బాక్సాఫీస్ రేంజ్ ను పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఆ విధంగానే ఆలోచించి చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా రామ్ చరణ్ కు మరో మంచి బూస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తమిళ్ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో అలాంటి సినిమానే మరొకటి చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కుతోంది.

  English summary
  10 Years For Ram pothineni Kandireega box office collections.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X