ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న సినిమాలివే.. లిస్టు మామూలుగా లేదుగా, రచ్చరచ్చే!
గత ఏడాది మొత్తం కరోనా కారణంగా పెద్ద సినిమాలు సైతం రిలీజ్కు నోచుకోలేదు.. ఈ ఏడాది కరోనా తగ్గుతుందని సినిమాలు ఎప్పటిలాగే రిలీజ్ చేసుకోవచ్చని భావించిన అందరికీ కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడి టెన్షన్ పెట్టింది. ఇప్పుడు కరోనా సెకండ్ దాదాపు ముగిసినట్లే. ఈ తరుణంలో ఈ ఏడాది రిలీజ్ అయ్యే సినిమాలు ఏమేమి ఉంటాయి అనే విషయాన్ని పరిశీలిస్తే ఆ లిస్టు మామూలుగా లేదు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

ఏకంగా 16 సినిమాలు
కరోనా మహమ్మారి కారణంగా దాదాపు సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సిన లవ్ స్టోరీ అలాగే టక్ జగదీష్ సినిమా కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. అయితే తాజా సమాచారం మేరకు ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ డేట్లు కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఏడాది 16 పెద్ద సినిమాలు రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి.

వాయిదా పడినవి అన్నీ
ముందు రిలీజ్ డేట్ల ప్రకారం చూస్తే నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా ఈ నెల 30వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వచ్చే నెల అంటే ఆగస్టు 13వ తేదీన నారప్ప సినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు. అదే నెల 27వ తేదీన నాని హీరోగా నటించిన టక్ జగదీష్ అలాగే అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

పెద్ద బడ్జెట్ సినిమాలు అన్నీ
బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ, వెంకటేష్ హీరోగా నటించిన మళయాళ సూపర్ హిట్ సినిమా రీమేక్ దృశ్యం 2 సెప్టెంబర్ 10వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే డేట్లు ప్రకటించకపోయినా ఆయా రోజులలో ఈ సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలైంది. మరోపక్క చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య, ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలు కూడా ఈ ఏడాదే రిలీజ్ అవుతాయని అంటున్నారు.

కుర్ర హీరోల సినిమాలు కూడా
అలాగే రవితేజ హీరోగా నటిస్తున్న కిలాడి, నాగచైతన్య హీరోగా నటిస్తున్న థాంక్యూ మూవీ, రానా హీరోగా నటిస్తున్న విరాటపర్వం, విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవి కాకుండా శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న మహాసముద్రం, సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న రిపబ్లిక్ నితిన్ హీరోగా నటిస్తున్న మ్యాస్ట్రో సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆ టెన్షన్ కూడా క్లియర్
నిజానికి మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో మూవీ టికెట్ రేట్ లకు సంబంధించి కొంత సందిగ్ధావస్థ కొనసాగింది. కానీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రేట్లు సవరించుకునే అవకాశం ఇవ్వడంతో ఇక సినిమా థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ ఏడాది రిలీజ్ కాబోయే సినిమాల లైనప్ చూస్తే టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు మంచి ఊపు రావడం ఖాయం.


Click it and Unblock the Notifications











