twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2.0 కలెక్షన్స్, సెకండ్ వీక్ కష్టమే: 10 రోజుల్లో అక్కడ ఎంత వసూలు చేసిందంటే..?

    |

    రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 2.0 హిందీ బాక్సాఫీసు వద్ద తన హవా కొనసాగిస్తూనే ఉంది. శనివారంతో విజయవంతంగా 10 రోజులు పూర్తి చేసుకున్న ఈచిత్రం రూ. 150 కోట్ల మార్కు క్రాస్ అయింది.

    అత్యధిక బడ్జెట్, విజువల్ వండర్‌గా రూపొందిన ఈ చిత్రంపై ముందు నుంచీ మంచి అంచనాలు ఉండటంతో బాక్సాఫీసు వద్ద ఓపెనింగ్స్ అదిరిపోయాయి. తొలి వారానికి అదనంగా ఒక రోజు కలిసి రావడంతో 8 రోజుల్లో రూ. 139.75 కోట్లు రాబట్టింది. అక్షయ్ కుమార్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. హిందీలో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన డబ్బింగ్ చిత్రాల్లో 2వ స్థానంలో... 2018లో టాప్ గ్రాసింగ్ సాధించిన హిందీ చిత్రాల్లో 6వ స్థానం దక్కించుకుంది.

    సెకండ్ వీక్ ‘కేదార్‌నాథ్' ఎఫెక్ట్

    సెకండ్ వీక్ ‘కేదార్‌నాథ్' ఎఫెక్ట్

    అయితే సెకండ్ వీక్ 2.0 చిత్రం మరింత డీలా పడే అవకాశం కనిపిస్తోంది. అందుకు కారణం ఈ వారం సారా అలీ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మూవీ ‘కేదార్‌నాథ్' విడుదల కావడమే. ఈ సినిమా రాకతో థియేటర్ల సంఖ్య తగ్గింది.

    శనివారం పుంజుకున్న కలెక్షన్

    శనివారం పుంజుకున్న కలెక్షన్

    ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సెకండ్ ఫ్రైడే ఈ చిత్రం హిందీ బాక్సాఫీసు వద్ద రూ. 5.85 కోట్లు రాబట్టింది. దీంతో 9రోజుల కలెక్షన్ రూ. 145.60 కోట్లకు చేరుకుంది. అయితే రెండో శనివారం వసూళ్లు పుంజుకున్నయి.

    టోటల్ వసూళ్లు రూ. 154.75 కోట్లు

    ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం రూ. 9.15 కోట్లు రాబట్టడంతో 10 రోజుల వసూళ్లు రూ. 154.75 కోట్లకు చేరుకుంది. అయితే ఈ చిత్రం వసూల్లు చూస్తుంటే హిందీలో రూ. 200 కోట్ల మార్కును అందుకోవడం కష్టమే అంటున్నారు.

    కేదార్‌నాథ్

    శుక్రవారం విడుదలైన ‘కేదార్‌నాథ్' 2.0 చిత్రానికి గట్టి పోటీ ఇస్తోంది. ఈ చిత్రం శుక్రవారం రూ. 7.25 కోట్లు వసూలు చేయగా.. శనివారం రూ. 9.75 కోట్లు రాబట్టింది. దీంతో తొలి రెండు రోజుల కలెక్షన్ రూ. 17 కోట్లకు చేరువైంది.

    English summary
    "#2Point0 picks up speed again... Growth on second Sat [vis-à-vis second Fri]: 56.41%... Should score on second Sun too... [Week 2] Fri 5.85 cr, Sat 9.15 cr. Total: ₹ 154.75 cr. India biz. Note: HINDI version." Taran Adrsh tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X