Don't Miss!
- Finance
SBI Q3 Result: రికార్డు లాభాలను నమోదు చేసిన స్టేట్ బ్యాంక్.. అంచనాలను తలదన్నేలా..
- News
తెలంగాణా బడ్జెట్ హైలైట్స్: బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట; కేసీఆర్ మార్క్ బాహుబలి బడ్జెట్ కేటాయింపులిలా!!
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కలెక్షన్ల ప్రభంజనం: 2.0 అక్కడ చరిత్ర సృష్టించబోతోందా?
Recommended Video

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 2.0 మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీగా వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళనాడులో పలు రికార్డులు బద్దలు కొట్టిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సూపర్ స్టార్ ఒకప్పుడు బస్సు కండక్టర్‌గా పని చేసి కర్నాటకలోనూ అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది.
ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా వెల్లడించిన వివరాల ప్రకారం... 2.0 మూవీ ఇక్కడ 15 రోజుల్లో 41.20 కోట్లు వసూలు చేసింది. 3డి గ్లాసెస్ హ్యాండ్లింగ్ చార్జీలతో కలుపుకుంటే మొత్తం వసూళ్లు రూ. 45 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించారు.

2.0 కన్నడలో చరిత్ర సృష్టించబోతోందా?
కన్నడనాట ఫుల్‌రన్ పూర్తయ్యే సమయానికి 2.0 టోటల్ వసూళ్లు రూ. 50 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రజనీకాంత్ చిత్రాల్లో కర్నాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఈ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం.

యూఎస్ఏ కలెక్షన్స్
ఇక యూఎస్ఏలో 2.0 మూవీ 15 రోజల టోటల్ కలెక్షన్స్ $5,224,282. ఇప్పటికీ ఈ చిత్రం అక్కడ 200 లొకేషన్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ వీకెండ్ వసూళ్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఫుల్ రన్‌లో 6 మిలియన్ మార్క్ అందుకోవచ్చని అంచనా.

3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సిందే
యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ఇండియన్ సినిమాల వసూళ్లు పరిశీలిస్తే బాహుబలి 2 మొత్తం 20.5 మిలియన్ డాలర్ల వసూళ్లతో మొదటి స్థానంలో ఉండగా, బాహుబలి మొదటి భాగం 6.99 వసూళ్లతో రెండో స్థానంలో ఉంది. అయితే 2.0 చిత్రం ఈ వసూళ్లను అందుకునే అవకాశం కనిపించడం లేదు.

ప్రపంచ వ్యాప్తంగా
2.0 మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 15 రోజుల్లో రూ. 710 కోట్లు రాబట్టింది. అయితే త్వరలో చైనాలో ఈ చిత్రాన్ని 56వేల స్క్రీన్లలో విడుదల చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.