Don't Miss!
- News
నేడు బీఆర్ఎస్ లో భారీ చేరికలు -కేసీఆర్ తో వరుస భేటీలు..!!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
2023 Sankranthi Week Collections: మెగాస్టార్, విజయ్ బాక్సాఫీస్ బ్లాస్ట్.. 4 సినిమాల టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా ఈ సంక్రాంతికి అతిపెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఎవరికి వారు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను వారి వైపు తిప్పుకునేందుకు బాగానే ప్రయత్నాలు చేశారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఎవరు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నారు? అలాగే ఈ సంక్రాంతి వీక్ లో మొత్తంగా సౌత్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్షన్స్ వచ్చాయి? అనే లెక్కలు వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

వీరసింహారెడ్డి లెక్క!
2023 సంక్రాంతి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు కూడా చాలా ప్రత్యేకంగా నిలిచింది అని చెప్పవచ్చు. ఇక మొదట విరసింహారెడ్డి భారీ స్థాయిలోనే విడుదల అయింది. ఈ సినిమా మొత్తం ఆరు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద 109.40 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక 65.10 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. బాలయ్య బాబు కెరీర్ లోనే వీర సింహారెడ్డి సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది.

మెగాస్టార్ వాల్తేరు వీరయ్య కలెక్షన్స్
ఈ సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య కూడా ఐదు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఐదు రోజుల్లో ఈ సినిమా మొత్తంగా బాక్సాఫీస్ వద్ద 144.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక మొత్తంగా 83.5 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన విషయం తెలిసిందే.

విజయ్ వారిసు
ఇక తమిళ ఇండస్ట్రీలో ఇద్దరు హీరోల మధ్య ఈసారి బలమైన పోటీ కనిపించింది. వారిసు సినిమాతో విజయ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏమిటో నిరూపించాడు. ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మొత్తంగా ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 213.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అలాగే 109 కోట్ల షేర్ కలెక్షన్స్ ను రాబట్టింది.

తునివు కలెక్షన్స్
ఇక అజిత్ నటించిన తునివు సినిమా కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఈ సినిమా భారీ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మొత్తంగా తొలి సినిమా ఏడు రోజుల్లో తెలుగు తమిళంలో కలిపి 149.66 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక 77.88 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తానికి అజిత్ కెరీర్ లో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెంచరీ నమోదు చేశాడు.

సంక్రాంతి 4 సినిమాల లెక్క ఇది!
ఫైనల్ గా 2023 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే నమోదయ్యాయి. విడుదలైన అన్ని సినిమాలను కూడా వాటి రేంజ్ కు తగ్గట్టుగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక మొత్తంగా సీజన్లో అయితే నాలుగు సినిమాలకు కలిపి 616.71 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక షేర్ 335.51 కోట్లు వచ్చింది. ఒక విధంగా ఇది బెస్ట్ సీజన్ అని మరోసారి రుజువైంది.