Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు.. బాలయ్య వర్సెస్ చిరు.. ఊహించని ఫైట్!
2023 సంక్రాంతికి ఒకేసారి బిగ్ బడ్జెట్ మాస్ కమర్షియల్ సినిమాలు వస్తూ ఉండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. అది కూడా మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ సినిమాలు కావడంతో బాక్సాఫీస్ వద్ద మాత్రం పోటీ మామూలుగా ఉండదు అనిపిస్తోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ రెండు సినిమాలకు మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. ఇక ఓవర్సీస్ లో ఏ సినిమా ఎక్కువ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుకుపోతోంది అనే విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతొంది.
ముందుగా ఈ సంక్రాంతికి జనవరి 12వ తేదీన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా విడుదలవుతుండగా.. ఆ తర్వాత రోజు అంటే జనవరి 13వ తేదీన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు సినిమాలు కూడా ఓవర్సీస్ లో వాటి విడుదల తేదీ కంటే ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ద్వారా సందడి మొదలుపెట్టబోతున్నాయి.

అయితే రెండు వారాల కంటే ముందుగానే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ చేసేసారు. దీంతో ఇప్పటినుంచి ఫ్యాన్స్ టికెట్లు దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం అడ్వాన్స్ బుకింగ్స్ లో ఎవరు దూకుడుగా ఉన్నారు అని వివరాల్లోకి వెళితే.. ముందుగా చాలా లొకేషన్లలో నందమూరి బాలకృష్ణ వీరాసింహారెడ్డి సినిమాకు ఎక్కువ స్థాయిలో బుకింగ్స్ అందబోతున్నట్లుగా తెలుస్తోంది.
ముందుగా వాల్తేరు వీరయ్య సినిమా 57 లొకేషన్స్ లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. దీంతో ఆ సినిమా ఇప్పటివరకు 28 వేల డాలర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అందుకుంది. ఇక నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ 64 లొకేషన్స్ లో ఓపెన్ అయ్యాయి. ఇక ఇప్పటివరకు ఆ సినిమా 43 వేల డాలర్స్ అందుకుంది. రోజురోజుకీ ఈ కలెక్షన్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మరి మొత్తంగా ఓవర్సీస్ లో చివరకు ఏ హీరో అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాడో చూడాలి.