»   » ‘టెంపర్’ టార్గెట్ రీచ్ అవడం కష్టమే?

‘టెంపర్’ టార్గెట్ రీచ్ అవడం కష్టమే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించింది. ఇప్పటికే ఈ చిత్రం 40 కోట్ల కలెక్షన్ మార్కు దాటింది. ఈ చిత్రం 50 కోట్లు వసూలు చేసి ఎన్టీఆర్ కెరీర్లో సరికొత్త రికార్డు సృష్టిస్తుందని అంతా ఆశించారు. అయితే పరిస్థితి చూస్తుంటే 50 కోట్ల టార్గెట్ రీచ్ అవడం కష్టమే అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఆ సంగతి పక్కన పెడితే టెంపర్ రిజల్ట్‌తో ఎన్టీఆర్, అతని ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. ఈ మూవీ ఇచ్చిన ఎనర్జీతో.. సుకుమార్‌ డైరెక్షన్‌లో నటించబోతున్న యంగ్‌టైగర్‌.. మరో భారీ హిట్‌ కొట్టాలని ఎంతో పట్టుదలగా ఉన్నాడట. నేనొక్కడినే సినిమాతో అపజయాన్ని మూటగట్టుకున్న దర్శకుడు సుకుమార్ సైతం.. ఎన్టీఆర్‌తో హిట్ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడట.

50 Cr Possible For Jr NTR Temper?

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ నిర్మిస్తోంది. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. ఈ చిత్రానికి దండయాత్ర అనే టైటిల్ ని పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది. ఇది దండయాత్ర...దయాగాడి దండయాత్ర అనేది పాపులర్ కావటంతో దండయాత్ర అనేదే ఫిక్స్ చేసే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఎన్టీఆర్‌ తండ్రిగా జగపతిబాబు నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్‌ తరహాలో వైవిధ్యంగా సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్‌ గెటప్‌ సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ చిత్రం. మార్చి 5న చిత్రం ప్లోర్ మీదకు వెళ్ళనుంది. అలాగే...జనవరి 8,2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

English summary
After the release of Jr NTR Temper based on the Temper’d collections, everyone was unanimously telling one thing that Jr NTR was going to join in 50crores club.
Please Wait while comments are loading...