For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  6 Years of Srimanthudu: మహేష్ బాబు బాక్సాఫీస్ బలాన్ని చూపించిన మూవీ.. టోటల్ కలెక్షన్స్!

  |

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కెరీర్ లో ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. అయితే అందులో కమర్షియల్ సినిమాలు ఎక్కువగా ఉన్నప్పటికీ శ్రీమంతుడు మాత్రం ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని అందుకుంది. అప్పటివరకు ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను ఒక్కసారిగా బ్రేక్ చేసిన ఆ సినిమా మహేష్ బాబు అభిమానులకు కూడా మంచి కిక్ ఇచ్చింది. గ్రామాల అభివృద్ధి రైతులు నేపథ్యం మాత్రమే కాకుండా అభిమానులకు నచ్చేలా ఫైట్ సీన్స్ లవ్ సీన్స్ కూడా ఈ సినిమాలో చాలా బాగా హైలైట్ అయ్యాయి. 2017 ఆగస్టు 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నేటితో ఆరేళ్ళ వసంతాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానును సినిమాకు సంబంధించిన ఫోటోలను రికార్డులను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందించిందో ఒకసారి లుక్కేద్దాం పదండి.

  ఒక్కసారిగా డీలా పడిపోయాడు

  ఒక్కసారిగా డీలా పడిపోయాడు

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడు బిజినెస్ మెన్ సినిమాలో అనంతరం మళ్లీ బాక్సాఫీస్ హిట్ చూడడానికి చాలా కాలం పట్టింది. వరుసగా నేనొక్కడినే, ఆగడు సినిమాలు డిజాస్టర్ కావడంతో ఒక్కసారిగా డీలా పడిపోయాడు. అనంతరం మిర్చి సినిమాతో హిట్ కొట్టి మాంచి ఫామ్ లో ఉన్న కొరటాల శివ శ్రీమంతుడు కథను వివరించాడు. సింగిల్ సిట్టింగ్ లోనే ఆ కథను ఓకే చేసిన మహేష్ బాబు మరికొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ ముందుగా శ్రీమంతుడు ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని అనుకున్నాడు. అయితే శ్రీమంతుడు కథను మొదట కొరటాల శివ వేరే స్టార్ హీరోలకు కూడా చెప్పాడు. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు.

  ఆ హీరోలు రిజెక్ట్ చేయడంతో

  ఆ హీరోలు రిజెక్ట్ చేయడంతో

  కానీ వారందరూ వివిధ కారణాల వల్ల ఆ కథను రిజెక్ట్ చేయడంతో చివరకు మహేష్ బాబు వద్దకు వచ్చింది. అనంతరం మహేష్ బాబు స్టార్ హోదాను దృష్టిలో ఉంచుకొని కొరటాల శివ కథలో కొన్ని మార్పులు కూడా చేశాడు. ఒక విధంగా సినిమా కథ మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగానే కరెక్ట్ గా సెట్ అయ్యింది. అప్పటి వరకు కమర్షియల్ మాస్ సినిమాలు ఎక్కువగా చేసిన సూపర్ స్టార్ శ్రీమంతుడు సినిమాలో మాత్రం హర్ష అనే పాత్రలో చాలా ఒదిగి నటించాడు. హీరోయిన్ గా శృతి హసన్ నటించగా జగతిబాబు హీరో తండ్రి పాత్రలో నటించాడు రాజేంద్రప్రసాద్ ఒక సాధారణ రైతు గా తనదైన శైలిలో నటించి హీరో పాత్రను మరింత ఎలివేట్ చేశారు. సినిమాలో ఫైట్ సీన్స్ కూడా ప్రత్యేకమైన క్రేజ్ వచ్చింది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు హైప్ క్రియేట్ చేయడంలో బాగా హెల్ప్ అయింది. ముఖ్యంగా శ్రీమంతుడు టైటిల్ సాంగ్ కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.

  బాక్సాఫీస్ కలెక్షన్స్

  బాక్సాఫీస్ కలెక్షన్స్

  ఈ సినిమాకు మహేష్ బాబు తన GMB ప్రొడక్షన్ ను కూడా జతచేసి మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి వారంలోనే సాలిడ్ వసూళ్లను అందుకుంది. మొత్తంగా తెలుగులో ప్రపంచ వ్యాప్తంగా 90.67 కోట్ల షేర్ అందుకొని 160కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. సినిమా తమిళ్ లో కూడా విడుదలైన విషయం తెలిసిందే. తమిళనాడు కేరళలో 1.5కోట్ల షేర్ ను అందుకుంది. వరల్డ్ వైడ్ గా రెండు భాషల్లో కలుపుకొని 92.30కోట్ల షెర్ రాగా 164 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కాయి. అప్పటివరకు మహేష్ బాబు కెరీర్లో అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమాగా కూడా శ్రీమంతుడు సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కొరటాల శివ స్థాయి కూడా ఆ సినిమాతో ఒక్కసారిగా పెరిగిపోయింది.

   మళ్ళీ కాపాడిన కొరటాల శివ

  మళ్ళీ కాపాడిన కొరటాల శివ

  ఆ సినిమా అనంతరం కొరటాల శివ జనతా గ్యారేజ్ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇక శ్రీమంతుడు తర్వాత మహేష్ బాబు బ్రహ్మోత్సవం స్పైడర్ వంటి సినిమాలను చేశాడు ఆ సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో మళ్లీ కొరటాల శివ దర్శకత్వంలో లోనే సినిమా చేయాలని ఫిక్స్ అయిన మహేష్.. భరత్ అనే నేను సినిమా చేశాడు. ఆ సినిమా కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందుకొని మహేష్ బాబుకు మళ్ళీ సక్సెస్ లోకి తీసుకొచ్చింది.

  Vihari tweets about Pspk rana movie | Filmibeat Telugu
   స్ట్రాంగ్ లైనప్ తో బిజీబిజీగా మహేష్

  స్ట్రాంగ్ లైనప్ తో బిజీబిజీగా మహేష్

  ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గీత గోవిందం దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ బాబు ఈ ఏడాది చివర్లో ఆ సినిమాను పట్టా లెక్కించాలని అనుకుంటున్నాడు. మరోవైపు రాజమౌళితో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఒకవేళ సినిమా ఆలస్యం అయితే మధ్యలోనే అనిల్ రావిపూడి తో మాస్ కమర్షియల్ సినిమా చేయవచ్చని తెలుస్తోంది. అసలైతే అనిల్ రావిపూడితో ఈపాటికే మరొక చేయాల్సింది. కానీ కరోనా లాక్ డౌన్ కారణాలవల్ల ప్రాజెక్టు ఆలస్యం అయ్యింది. ఇక ఇప్పుడు మాత్రం మహేష్ బాబు ఎప్పుడు పిలిచినా స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, వెంటనే సినిమాను కూడా స్టార్ట్ చేస్తానని దర్శకుడు అనిల్ ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.

  English summary
  6 years of Mahesh babu srimanthudu movie total box office collections and total profits, 2017
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X