»   » 'కబాలి' తెలుగు టోటల్ కలెక్షన్స్ , ఎంతకు కొన్నారు?, ఎంత లాస్?

'కబాలి' తెలుగు టోటల్ కలెక్షన్స్ , ఎంతకు కొన్నారు?, ఎంత లాస్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మార్నింగ్ షోకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. రజనీకు మంచి మార్కెట్ ఉన్ తమిళ్ అంతో ఇంతో పర్లేదనిపించిన ఈ సినిమా.. తెలుగులో మాత్రం పూర్తిగా నిరాశ పరిచింది.

పబ్లిసిటీ మాయ.. అడ్వాన్స్ బుకింగ్ ల హంగామా, మీడియా సహకారంతో తో మొదటి వీకెండ్ స్ట్రాంగ్ గా కనిపించిన ఈ చిత్రానికి.. ఆ తర్వాత మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు కబాలి ఫుల్ రన్ పూర్తయిపోయింది. అన్ని ఏరియాల్లోనూ కబాలి కథ కంప్లీట్ అయిపోయి..అసలు ఎంత నష్ఠపోయిందో బయిటకు వచ్చేసింది.


9 crores loss for Kabali distributors?


ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...ఫుల్ రన్ లో కబాలి తెలుగు వెర్షన్ కి వచ్చిన వసూళ్లు 23.53 కోట్ల రూపాయలు. ఓ డబ్బింగ్ సినిమాకి ఈ స్దాయి కలెక్షన్స్ బాగానే వచ్చినట్లు అనిపించినా .. డిస్ట్రిబ్యూటర్లకు అమ్మిన రేట్ల ప్రకారం చూస్తే ఇది పక్కా లాస్ వెంచర్ అని అర్ధమైపోతుంది.


ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్ అక్షరాల రూ.32 కోట్లకు కొనుగోలు చేశాడు. ఈ చిత్రంపై నెలకొన్న అంచనాల నేపధ్యంలో. రూ.50 కోట్ల క్లబ్ లో చేరుతుందన్న నమ్మకంతో ఆయన అంతమొత్తం పెట్టి తెలుగు హక్కుల్ని తీసుకున్నాడు.


అయితే. ఈ చిత్రంపై నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. టోటల్ రన్లో అయిన పెట్టిన పెట్టుబడి వస్తుందని భావించారు. కానీ. చివరికి డిస్ట్రిబ్యూటర్ కు భారీ నష్టాలే మిగిలాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం. ఈ చిత్రం టోటల్ రన్లో రూ.23.53 కోట్లే కలెక్ట్ చేసింది. ఈ లెక్కన పంపిణీదారుడికి రూ.8.47 కోట్ల నష్టం వాటిల్లిందన్నమాట.


రజినీకాంత్ గత రెండు చిత్రాలు కొచ్చాడయాన్ - లింగాలకు.. కబాలి కలిపి డిజాస్టర్ల హ్యాట్రిక్ పూర్తయిపోయింది. డిస్ట్రిబ్యూటర్లను మరోసారి రజినీ మూవీ ముంచేసింది. ఈ సినిమాలో తమిళ వాసన ఎక్కువగా ఉండడం, తెలుగు ఆడియన్స్ కావాల్సిన ఎలిమెంట్స్ ఏమాత్రం లేకపోవడం, పైగా కథలో కొత్తదనం ఏమీ లేకపోవడం. వంటి కారణాల వల్ల ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచిందని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు.ఏరియాలవారీగా 'కబాలి" తెలుగు టోటల్ కలెక్షన్స్ :


నైజాం : 9.20
సీడెడ్: 3.60
వైజాగ్ : 2.30
గుంటూరు : 1.95
ఈస్ట్ గోదావరి : 1.85
కృష్ణా : 1.48
వెస్ట్ గోదావరి : 1.40
నెలూరు : 0.75


టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 22.53 కోట్లు

English summary
Actually "Kabali" is bought nearly for 30 crores by newcomer distributors Praveen and KP Chowdary, and they have sold Nizam to Abhishek pictures. According to updates nearly 9 crores loss in distributors pockets as they have spent bomb on publicity as well.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu