twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆడు మగాడ్రా బుజ్జీ' ఫస్ట్ డే కలెక్షన్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'ప్రేమకథాచిత్రమ్‌'తో తొలి విజయాన్ని అందుకొన్న సుధీర్‌బాబు తాజా చిత్రం 'ఆడు మగాడ్రా బుజ్జీ'. గంగదాసు కృష్ణారెడ్డి దర్శకుడు దా పరిచయమవుతున్న ఈ చిత్రం మొన్న శనివారం విడుదల అయ్యింది. నైజాం మినహా ఆంధ్రాలో చాలో చోట్ల సమ్మె ప్రభావంతో థియోటర్స్ లో షోలు పడలేదు. అయినా ఓపినింగ్స్ చాలా బాగా వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మల్టిప్లెక్స్ లలో పెద్దగా లేకున్నా... మిగతా థియోటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి.

    మొదటి రోజు ఎపి కలెక్షన్స్ షేర్

    నైజాం - 44 లక్షలు

    సీడెడ్ - 13 లక్షలు

    వైజాగ్ - 11 లక్షలు

    గుంటూరు - 10 లక్షలు

    ఈస్ట్ గోదావరి -6 లక్షలు

    వెస్ట్ గోదావరి - 5 లక్షలు

    నెల్లరూ - 3.5 లక్షలు

    కృష్ణా - 4.5 లక్షలు

    మొత్తం - 97 లక్షలు

    గమనిక: ఇవి ట్రేడ్ లో చెప్పబడుతున్న లెక్కలు మాత్రమే... అలాగే నైజాం మినహా ఏరియాలో చాలా చోట్లు శనివారం...సమ్మె ప్రభావంతో చాలా థియోటర్స్ లో షోలు పడలేదు

    కథ ఏమిటంటే..కాలేజీలో అందమైన అమ్మాయిని అస్మిత. అయితే ఆమె వైపు చూడటానికి అబ్బాయిలు భయపడుతుంటారు. దానికి కారణం ఆమె అన్నయ్య( రణ్‌ధీర్). అతను కాలేజీలో డాన్‌. అయితే సిద్దు(సుధీర్‌) మాత్రం ఆమె కోసమే కాలేజీకొస్తాడు. ఆమెను ప్రేమిస్తాడు. అయితే దాని వెనుక మాత్రం పెద్ద కారణముంటుంది. అది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇలాంటి సినిమాలు ఇప్పటికే చాలా వచ్చుంటాయి. వాటిలో ఇది భిన్నంగా ఉంటుంది.

    హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ... దర్శకుడు కృష్ణారెడ్డి నాకు కథ ఎలా చెప్పాడో, అలాగే తీశాడు. రాజమౌళి శిష్యుడైనా ఆ ప్రభావం ఏమీ లేకుండా, ఎవర్నీ కాపీ కొట్టకుండా చాలా బాగా తీశాడు. కథలోని మలుపుకు కారణమయ్యే కీలక పాత్రను పూనమ్ కౌర్ చేసింది. హీరోయిన్‌గా అందమైన అమ్మాయి కావాలి. అస్మితా సూద్ ఆ పాత్రకు సరిగ్గా సరిపోయింది.

    Aadu Magadra Bujji 1st day AP Collections

    విలన్‌గా చేసిన అజయ్‌ది ఇందులో స్ట్రాంగ్ క్యారెక్టర్. రాజకీయ నాయకుడు కావాలని తపించే శంకరన్న అలియాస్ బుజ్జిగా చాలా బాగా నటించాడు. ఇక ఇందులోని ఓ కుక్క పాత్ర గురించీ చెప్పుకోవాలి. దానికి ఈ సినిమాలో చాలా కష్టాలొస్తాయి. దానికీ, నాకూ మధ్య సంభాషణలు ఉంటాయి. ఆ కుక్క కూడా కామెడీ పంచుతుంది అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ... ఇది యాక్షన్ మేళవించిన పూర్తి స్థాయి కామెడీ సినిమా. హీరో క్యారెక్టరైజేషన్ బాగా వచ్చింది. కొత్తగా అనిపిస్తుంది. అనుకున్నది ఏదైనా సాధించేవాడే మగాడు. 'అతడు'లో మహేశ్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. దాని తరహాలోనే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఉంటుంది అన్నారు.

    English summary
    
 super star Krishna’s son-in-law Sudheer Babu's latest Aadu Magadura Bujji released two days back with House Full openings.Directed by Gangadasu Krishna Reddy, Aadu Magadura Bujji has Asmita Sood and Poonam Kaur as heroines. The film has music by Sri.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X