twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ ని బాగానే మార్కెటింగ్ చేస్తున్నారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్ తోనే వరసగా మూడు సినిమాలు చేసిన ఘనత 14 రీల్స్ వారిదే అనే సంగతి తెలిసిందే. దూకుడు, 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాలు వారు భారీ బడ్జెట్ తో రూపొందించారు. దూకుడుతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యానర్ మిగతా రెండు చిత్రాలతో సూపర్ ఫ్లాఫ్ లని చవి చూసారు. అయితే ఈ మూడు చిత్రాలకు వీరు పబ్లిసటీ విషయంలో చాలా విభిన్నంగా ముందుకు వెళ్ళారు. అలాగే బిజనెస్ సైతం బాగనే చేసారని సమాచారం. ఈ నేపధ్యంలో రీసెంట్ ఫ్లాఫ్ ఆగడు ని సైతం బిజినెస్ ఇంకా చేస్తున్నారని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మహేష్ కు మిగతా చోట్ల ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకునే విధంగా ఓ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పుకంటున్నారు.

    వివరాల్లోకి వెళితే... భాక్సాఫీస్ దగ్గర మహేష్‌బాబు 'దూకుడు' తెలిసిందే. 'పోకిరి', 'దూకుడు', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇవన్నీ బాక్సాఫీసుకు కొత్త రికార్డుల రుచి చూపించాయి. ఓవర్సీస్‌లో మహేష్‌కి తిరుగులేదు. వరస విజయాలతో తిరుగులేని స్థానం సంపాదించుకొన్న మహేష్‌ 'ఆగడు' తో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించరించాడు.

    మహేష్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఆగడు. ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో ఎనకౌంటర్ శంకర్ టైటిల్ తో డబ్బింగ్ చేసి వదలటానికి రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. అక్కడ కూడా భారీగా రిలీజ్ చేసి, నార్త్ లో మహేష్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకుని, దాన్ని అడ్డం పెట్టి హిందీ శాటిలైట్ రైట్స్ అమ్మనున్నారని చెప్పుకుంటున్నారు.

    Aagadu makers still doing business with the film

    గతంలో భాక్సాఫిీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచిన 1,నేనొక్కిడినే చిత్రాన్ని ఏక్ క దమ్ టైటిల్ తో విడుదల చేసారు. అయితే దురదృష్టవశాత్తు ఆ చిత్రం నార్త్ ఆడియన్స్ కు కూడా నచ్చలేదు. పోకిరి, ఖలేజా, బిజినెస్ మ్యాన్ చిత్రాలు మాత్రం నార్త్ లో బాగానే ఆడాయి. దాంతో ఆగడు చిత్రంపై ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది.

    ఇక ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే బిజినెస్‌ పూర్తయింది. శాటిలైట్‌ రూపంలో దాదాపు రూ.12 కోట్లు అందుకొన్నట్టు అంచనా. మహేశ్‌ జోడీగా తొలిసారి తమన్నా నటించటం, శ్రుతిహాసన్‌ ఓ పాటలో మహేశ్‌తో స్టెప్పులేయడం అదనపు ఆకర్షణలు. ఇవి నార్త్ వారిని ఆకట్టుకునే అవకాసం ఉందని అంటున్నారు.

    డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో-డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    Mahesh babu's latest Aagadu Movie is dubbed in Bollywood as Encounter Shnakar and is getting ready for grand release in B-Town.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X