»   » ‘ఆగడు’ టిక్కెట్ వేలం: 90 వేలకు దక్కించుకున్న ఫ్యాన్!

‘ఆగడు’ టిక్కెట్ వేలం: 90 వేలకు దక్కించుకున్న ఫ్యాన్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: మహేష్ బాబు సినిమా చూడటం కోసం ఎంతకైనా తెగించే వీరాభిమానులు ఉన్నారని మరోసారి రుజువైంది. అమెరికాలోని మిచిగాన్‌లో ఆగడు ఫస్ట్ టికెట్ వేలం పాట నిర్వహించారు. ప్రనీష్ రెడ్డి అనే ఓ అభిమాని ‘ఆగడు' టికెట్‌ను ఏకంగా 1500 డాలర్లు(దాదాపు రూ. 90 వేలు)కు సొంతం చేసుకున్నాడు. రెండో టికెట్‌ను హిరేన్ రెడ్డి అనే అభిమాని 1000 డాల్లర్లకు సొంతం చేసుకున్నాడు. ఎగ్జిబిటర్లు అజయ్ రెడ్డి, వంశీ చేతుల మీదుగా విజేతలు టికెట్స్ అందుకున్నారు.

  మిచిగాన్ లోని నోవి లొకేషన్లో ఆగుడు చిత్రాన్ని ఐమాక్స్ స్క్రీన్(సాధారణ 70 ఎంఎం స్క్రీన్ కంటే నాలుగు రెట్లు పెద్దగా ఉంటుంది)లో ప్రదర్శిస్తున్నారు. ఈ స్క్రీన్ పై ప్రదర్శితం అవుతున్న తొలి తెలుగు సినిమా ఇదే. మిచిగాన్ టెర్రిటరీలో 7 లొకేషన్లలో సినిమా విడుదల చేస్తున్నారు. 4 లొకేషన్లలో ప్రీమియర్ షోలు వేస్తున్నారు.

  Aagadu tickets auction

  మిచిగాన్‌లో ఉండే మహేష్ బాబు సినీ అభిమానుల సౌకర్యార్థం లగ్జరీ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ‘ఆగడు' సినిమాకు మంచి స్పందన వస్తుండటంపై మిచిగాన్ ఎగ్జిబిటర్లు ఆనందంగా ఉన్నారు. తమకు అవకాశం ఇచ్చిన 14 రీల్స్ సంస్థ వారికి డిస్ట్రిబ్యూటర్లు రవి, శ్రీకాంత్, శ్రీనివాస్ థాంక్స్ చెప్పారు.

  శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ‘ఆగడు' చిత్రంలో తమన్నా హీరోయి‌న్‌గా చేస్తోంది. సెప్టెంబర్ 19న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  English summary
  Aagadu has become one of the biggest talk of the town as release is not even a week ahead. Expectations are sky high and fans are going crazy with the trailers released recently. Here comes big news again from MICHIGAN, USA. There was tickets auction held for AAGADU and first ticket is sold at 1500$ (Praneesh Reddy) and second ticket at 1000$ (Hiren Reddy).
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more