»   » 'కాటమరాయుడు' హైప్ ఏం రేంజిలో ఉందో చెప్పటానికి ...ఈ చిన్న ఉదాహరణ చాలు

'కాటమరాయుడు' హైప్ ఏం రేంజిలో ఉందో చెప్పటానికి ...ఈ చిన్న ఉదాహరణ చాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ తాజా చిత్రం 'కాటమరాయుడు' మొదలైనపుడు అంతగా హైప్ లేదు. కానీ టీజర్ వచ్చాక మొత్తం సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఊహించని విధంగా అంచనాలు రెట్టింపు అయిపోయాయి. దానికి తోడు ఆ అంచనాల్ని మరింత పెంచేస్తూ 'కాటమరాయుడు' టీమ్ పబ్లిసిటీ ఓ రేంజిలో కుమ్మేస్తోంది.

సోషల్ మీడియాలో దాదాపు ప్రతీ రోజూ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ ... సినిమా మీద హైప్ పెంచుతోంది. అక్కడితో ఆగకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో హోర్డింగ్‌లు.. బస్సుల మీద పోస్టర్లు.. ఇలా హంగామా పెద్ద స్థాయిలోనే ఉంది. దీని వల్ల ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. మరి ఈ ప్రబావం ఎక్కడ కనపడుతోంది అంటే..బిజినెస్ మీద అని చెప్పాలి.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజిలో జరిగింది అనటానికి చిన్న ఉదాహరణ...కృష్ణా జిల్లా లో ఈ చిత్రం రైట్స్ అమ్మకం. ఇప్పటివరకూ పవన్ ఏ సినిమా పలకని రేటుకు అంటే నాలుగున్న కోట్లకు ఈ చిత్రం రైట్స్ అమ్ముడయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది.

About Pawan's Katamarayudu’s Krishna rights

ఈ సినిమాకు ఆడియో వేడుకను నిర్వహించకుండా.. ఒక్కో పాటను డైరెక్ట్ గా ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తూ సినిమా కు క్రేజ్ తీసుకువస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ సాంగ్, రొమాంటిక్ కు మంచి రెస్పాన్స్ రావటంతో రెండో పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం శాటిలైట్ డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం .... తెలుగు టీవీ ఛానెల్ ...జెమినీ టీవీ వారు కాట‌మ‌రాయుడు శాటిలైట్‌ని కైవ‌సం చేసుకున్నారు. దాదాపు రూ.12.5 కోట్ల‌కు శాటిలైట్ హ‌క్కులు అమ్ముడుపోయాయ‌ని తెలుస్తోంది. స‌ర్దార్ గబ్బ‌ర్ సింగ్ ఫ్లాప్ అయినా... వీర‌మ్ సినిమాకి ఇది రీమేక్ అయినా... ప‌వ‌న్ సినిమాకి ఉన్న క్రేజ్ తో ఈ రేంజి శాటిలైట్ రైట్స్ పలకాయని చెప్తున్నారు. గబ్బర్ సింగ్ స్దాయిలో ఈ రీమేక్ కూడా ఆడుతుందనే నమ్మకంతో ఈ రైట్స్ ఈ రేటుకు అమ్ముడుపోయాయని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కోసం దాదాపు అన్ని ఛానెల్స్ పోటీ పడటం విశేషం.

నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 24న రిలీజ్ చేయనున్నారు. మార్చి 18న హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సరైనోడు, ధృవ, ఖైదీ నెం 150, విన్నర్ చిత్రాలు ప్రీ రిలీజ్ వేడుకని జరుపుకొని మంచి విజయాలు సాధించడంతో కాటమరాయుడు టీం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.

శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్ దర్శకత్వం: కిషోర్ పార్ధసాని

English summary
Now Krishna rights of the Pawan's Katamarayudu has been closed for 4.5 crores.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu