»   » భూకంపమా? సునామా? పెనుతుఫానా?.. అజ్ఞాతవాసి కలెక్షన్లు.. ట్రేడ్ అనలిస్టులకు షాక్

భూకంపమా? సునామా? పెనుతుఫానా?.. అజ్ఞాతవాసి కలెక్షన్లు.. ట్రేడ్ అనలిస్టులకు షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu
'అజ్ఞాతవాసి' కలెక్షన్స్ చూస్తే షాకే !

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రంపై సమీక్షలు ఎలా ఉన్నా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రంపై అభిమానులు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్ర కలెక్షన్లపై తరుణ్ ఆదర్శ్, ఇతర ట్రేడ్ అనలిస్టులు ఆశ్చర్యకరమైన కామెంట్లు చేశారు.

పెనుతుఫానులా కలెక్షన్లు

అజ్ఞాతవాసి చిత్ర వసూళ్లు ఓ తుఫాన్‌లా ఉన్నాయి. సునామీని తలపిస్తున్నాయి. భూమిని కంపించే విధంగా కలెక్షన్లు రాబడుతున్నది. అమెరికా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. హాలీవుడ్ చిత్రాలకు మించి కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ చిత్రం వారం మధ్యలో విడుదలైనప్పటికీ.. కలెక్షన్ల గ్రాఫ్ దూసుకుపోతున్నది.


హాలీవుడ్‌లో అజ్ఞాతవాసి టాప్

హాలీవుడ్‌లో ఓ తెలుగు సినిమా సత్తా చాటుతున్నది. అమెరికాలో అజ్ఞాతవాసి చిత్రం కలెక్షన్లు బ్రహ్మండంగా ప్రారంభమయ్యాయి. వర్కింగ్ డే రోజున 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు. సినీ కలెక్షన్ల విషయంలో ఇది అద్భుతమైన విషయమే అని తరుణ్ మరో ట్వీట్ చేశారు.


తొలి రోజున 1.7 మిలియన్ డాలర్లు

అజ్ఞాతవాసి చిత్రం వసూళ్లపై ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం పెను తుఫానునే సృష్టిస్తున్నది. ఈ చిత్ర వసూళ్లు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. అమెరికాలో మొదటి రోజున 1.7 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ వసూళ్లు తిరుగులేనివి అని రమేష్ బాలా ట్వీట్ చేశారు.


 కృష్ణాలో రికార్డు కలెక్షన్లు

కృష్ణాలో రికార్డు కలెక్షన్లు

అజ్ఞాతవాసి చిత్రం కృష్ణా జిల్లాలో భారీ వసూళ్లను సాధించింది. తొలి రోజున ఈ చిత్రం రూ.1.83 కోట్లు కలెక్ట్ చేసింది. బాహుబలి కాకుండా మిగితా చిత్రాలు వసూలు చేసిన రికార్డులను తిరగరాసింది. అయితే కృష్ణా జిల్లా హక్కులను 8 కోట్ల రూపాయలకు అమ్మినట్టు సమాచారం.బాహుబలి2 చిత్రం రూ.2.84 కోట్లు కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.


 ఏపీలో జిల్లాల వారీగా

ఏపీలో జిల్లాల వారీగా

ప్రాథమిక సమాచారం ప్రకారం.. అజ్ఞాతవాసి చిత్రం వైజాగ్‌లో 3.75 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.2.86 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.3.70 కోట్లు, గుంటూరులో రూ.3.78 కోట్లు, నెల్లూరులో 1.64 కోట్లతోపాటు ఆంధ్రాలో రూ. 17.56 కోట్లు వసూలు చేసింది.


నైజాం, సీడెడ్‌లో

నైజాం, సీడెడ్‌లో

ఇక సీడెట్‌లో రూ.3.35 కోట్లు, నైజాంలో రూ.545 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఆంధ్రా, నైజాంలో రూ. 26.36 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.


 కర్ణాటక, తమిళనాడులో

కర్ణాటక, తమిళనాడులో

అమెరికాలో రూ.10.8 కోట్లు, కర్ణాటకలో రూ.5.14 కోట్లు, మిగితా ప్రదేశాల్లో కలిపి మొత్తంగా రూ.45 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తున్నది. అయితే అధికారికంగా ఈ కలెక్షన్లు వెల్లడి కావాల్సి ఉంది.


బోమన్ ఇరానీ ట్వీట్

అజ్ఞాతవాసి చిత్రం ఘనవిజయం వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆ చిత్రంలో కీలకపాత్రలో నటించిన బోమన్ ఇరానీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ సభ్యులందరికీ నా విషెస్. నాపై కురిపించిన ప్రేమానురాగాలకు ధన్యుడిని అని బోమన్ ట్వీట్ చేశారు.


English summary
The distributors have made plans for a massive release of Agnyaathavaasi movie across North America. They have already booked 576 screens in the USA and are still finding more to add theaters to it which is a very big release for any Indian movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X