twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అఖిల్‌' ...అసలు సమస్య మొదలైనట్లే

    By Srikanya
    |

    హైదరాబాద్ :వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొంది దీపావళి కానుకగా రిలీజ్ అయిన చిత్రం 'అఖిల్‌' . శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రేడ్ లో ఎక్సపెక్ట్ చేసినట్లుగానే ఈ చిత్రం మార్నింగ్ షోకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవటంతో గణణీయంగా కలెక్షన్స్ డ్రాప్ అవటం మొదలెట్టాయి. ముఖ్యంగా మొదటవారాంత కలెక్షన్స్ దారుణంగా ఉండటం నిర్మాతను, పంపిణీదారులను కలవరపెడుతోందని తెలుస్తోంది.

    ట్రేడ్ లో చెప్పుకునేదాన్ని బట్టి..."అఖిల్" చిత్రం తొలి వారాంతానికి ప్రపంచవ్యాప్తంగా 16.3 కోట్ల షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొదటి రోజే 10 కోట్లు సాధించిన ఈ చిత్రం తర్వాత నాలుగు రోజుల్లో కేవలం ఆరు కోట్లు మాత్రమే కలెక్టు చేయటం ఇబ్బందికర అంశమే. కొద్దిలో కొద్ది కర్ణాటక...1.05 కోట్లు కలెక్టు చేసి రిలీఫ్ ఇచ్చింది.

    Akhil collections : Trouble Started

    దాంతో లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ..దాదాపు అరవై శాతం వరకూ నష్టం తప్పదనే నిర్ణటానికి వచ్చేసారు. అదే యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ పరిస్దితి మరీ దారుణంగా ఉందని సమాచారం. అక్కడ నాలుగు కోట్లు పెట్టి ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు. అక్కడ దాదాపు తొంభై శాతం వరకూ నష్టపోయినట్లు తెలుస్తోంది. ఇవన్నీ ప్రక్కన పెడితే నిర్మాత నితిన్ సైతం నైజాం ఏరియాలో ఈ సినిమా ని డిస్ట్రిబ్యూట్ చేసారు. అక్కడా బాగా లాస్ వస్తుందని సమాచారం.

    అయితే ఇప్పుడు వారి ముందున్న సమస్య... సినిమా రైట్స్ తీసుకుని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్...తమకు న్యాయం చేయమని అడగటమే అంటున్నారు. అది అన్ని వైపులు నుంచి వస్తే...నిర్మాతకు ఊహించని కలవరపాటే. అయితే నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి అలాంటి సమస్య రాకుండా మేనేజ్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది.

    Akhil collections : Trouble Started

    ఇదే డ్రాప్ కంటిన్యూ అయితే కేవలం 17-20 కోట్లు మాత్రమే వెనక్కి వస్తాయి. అయితే ఈ సినిమాని 44 కోట్లు పైచిలుకే రేట్లుకు అమ్మారని సమాచారం. దాంతో దాదాపు సగానికి సగం నష్టం ఈ సినిమా పంపిణీదారులకు మిగిలుస్తుంది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

    శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

    English summary
    "Akhil" movie local distributors end up losing 55-60% losses, USA distributors who invested 4 crores will be nearly 90% loss.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X