Just In
- 8 min ago
షూటింగ్లో పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య.. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చూశాక ఒకటి అర్థమైంది: అనన్య
- 28 min ago
వకీల్ సాబ్ వీక్షిస్తోన్న రాజమౌళి.. త్వరలోనే దర్శకధీరుడి రివ్యూ!
- 46 min ago
కరోనా ఎఫెక్ట్.. క్వారంటైన్లో పవన్ కళ్యాణ్.. ఆందోళనలో అందరూ అలా!
- 1 hr ago
మరో పవర్ఫుల్ మాస్ దర్శకుడిని లైన్ లో పెడుతున్న రవితేజ?
Don't Miss!
- Finance
IPL 2021: కస్టమర్లకు జియో బంపరాఫర్, ప్రత్యేక ప్లాన్స్ ఇవే
- News
ఉలిక్కిపడ్డ విశాఖపట్నం: భారీ అగ్నిప్రమాదం: అలముకున్న పొగ: దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి
- Sports
ఓటమి బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి షాక్.. కెప్టెన్ ధోనీకి భారీ జరిమానా!
- Lifestyle
Ugadi 2021: ఉగాది శుభాకాంక్షలు ఇలా చెబితే.. మీ సన్నిహితులు చాలా సంతోషిస్తారు...
- Automobiles
మలేసియాలో విడుదలైన 2021 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్; పూర్తి వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Naandhi 14 Days Collections: ఆ హీరోలకు ఏమాత్రం తీసిపోని నరేష్.. ‘నాంది’తో గట్టిగానే కొట్టాడుగా!
బడా డైరెక్టర్ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. కామెడీ చిత్రాల హీరోగా తనదైన ముద్రను వేసుకున్నాడు అల్లరి నరేష్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు. అయితే, కేవలం హాస్యభరిత చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తుండడం.. ఒకే పంథాను ఫాలో అవడంతో చాలా ఏళ్లుగా హిట్‌ను దక్కించుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'నాంది' అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆరంభం నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్ల పరంగా సత్తా చాటింది. ఈ సినిమా రెండు వారాల్లో ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

సరికొత్త ప్రయోగంతో ‘నాంది' పలికిన నరేష్
మూస ధోరణిలో కామెడీ చిత్రాలనే చేసుకుంటూ వచ్చిన నరేష్.. వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు తీసిన ‘నాంది'తో అతడు మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఇది సూపర్ హిట్ అయింది.

భారీగా ప్రీ బిజినెస్.. మొదటి వారంలో డన్
నరేష్ సినిమా అంటే ప్రేక్షకులందరిలోనూ ఓ రేంజ్ అంచనాలు ఉంటాయి. అయితే, ఈ మధ్య అవి తగ్గిపోయాయి. దీంతో అతడి మార్కెట్ కూడా పడిపోయింది. ఈ నేపథ్యంలో ‘నాంది'కి మాత్రం ఊహించని విధంగా రూ. 2.70 కోట్ల వరకూ జరిగింది. ఇంత మొత్తం వసూలు అవుతుందా అని అనుమానాలు వ్యక్తం అవగా.. కేవలం వారం రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను దాటేసింది.

నరేష్‌కు రెండు విధాలుగా పని చేసిన నాంది
‘నాంది' సినిమాతో అల్లరి నరేష్‌కు నటుడిగా మంచి పేరు వచ్చింది. అదే సమయంలో చాలా కాలంగా ఎదురు చూస్తోన్న హిట్ కూడా దక్కింది. ఇలా ఈ సినిమా అతడికి రెండు విధాలుగా మంచినే చేసింది. అలాగే, తన కెరీర్‌కు సరికొత్త ఊపును ఇచ్చింది. ఈ కారణంగానే ‘ఉప్పెన', ‘చెక్' వంటి భారీ చిత్రాల నుంచి ఉన్న పోటీని కూడా తట్టుకుని ‘నాంది' మూవీ కలెక్షన్లను సాధిస్తోంది.

14వ రోజు ‘నాంది' ఎంత వసూలు చేసింది?
14వ రోజు ‘నాంది' కలెక్షన్లు పర్వాలేదనిపించాయి. గురువారం ఈ మూవీ నైజాంలో రూ. 1 లక్షలు, సీడెడ్‌లో రూ. 40 వేలు, ఉత్తరాంధ్రలో రూ. 1 లక్షలు, ఈస్ట్‌లో రూ. 40 వేలు, వెస్ట్‌లో రూ. 40 వేలు, గుంటూరులో రూ. 60 వేలు, కృష్ణా రూ. 70 వేలు, నెల్లూరులో రూ. 20 వేలు వసూలు చేసింది. ఓవరాల్‌గా 14వ రోజు రూ. 5 లక్షలు షేర్, రూ. 8 లక్షలు గ్రాస్ రాబట్టి సత్తా చాటింది.

14 రోజులకు కలిపి మొత్తం ఎంత రాబట్టింది?
వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన' మూవీ ప్రభావం కొనసాగుతూ ఉన్నా.. గత వారం ‘చెక్' సహా కొన్ని కొత్త సినిమాలు విడుదలైనా నరేష్ మూవీ ‘నాంది' రాణిస్తూనే ఉంది. తద్వారా 14 రోజులకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.64 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 18 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 10 లక్షలు సహా ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.92 కోట్లు షేర్, రూ. 9.15 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ఆ హీరోలకు ఏమాత్రం తీసిపోని అల్లరి నరేష్
అల్లరి నరేష్ సినిమాకు మొదటి నుంచీ ప్రేక్షకుల మంచి స్పందననే అందిస్తున్నారు. దీంతో మీడియం రేంజ్ హీరోలతో సమానంగా ఈ సినిమా కలెక్షన్లు వచ్చాయి. అందుకే రెండు వారాలకు దాదాపు రెండు కోట్ల రూపాయల (రూ. 1.92 కోట్టు) వరకూ లాభాలను అందుకుంది. ఇక, ఈ సినిమాతో నిర్మాతలకు డబ్బులు, నరేష్‌కు ప్రశంసలు, దర్శకుడికి బూస్ట్ వచ్చిందనే చెప్పాలి.