»   » గుమనించండి: అల్లరి నరేష్ ‘ఇంట్లో దయ్యం నాకేం భయం’ రిలీజ్ డేట్ మారింది

గుమనించండి: అల్లరి నరేష్ ‘ఇంట్లో దయ్యం నాకేం భయం’ రిలీజ్ డేట్ మారింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వరస ఫ్లాఫ్ లతో వెనక బడిన అల్లరి నరేష్ గత కొద్దికాలంగా ఓ సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్నారు. కెరీర్ మొదటినుంచీ మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్న నరేష్, ఈమధ్య కాలంలో మాత్రం ఎక్కడా మెప్పించలేకపోవటం,కామెడీలు నవ్వించలేకపోవటం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే ఆయన తనకు గతంలో సీమ శాస్త్రి, సీమ టపాకాయి వంటి హిట్స్ ఇచ్చిన నాగేశ్వరరెడ్డితో కలిసి, ప్లాన్ చేసి చేస్తున్న కొత్త సినిమా 'ఇంట్లో దయ్యం నాకేం భయం'. ఈ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.


Allari Naresh's Intlo Deyyam on 12th November

అయితే మొదట నవంబర్ 11నే సినిమాను ప్రేక్షకులకు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసిన టీమ్, తాజాగా నవంబర్ 12కు విడుదల తేదీని మార్చింది. తాను గతంలో అల్లరి నరేష్‌తో చేసిన చిత్రాలన్నీ హిట్ అయ్యాయని, మరోసారి తమ జంట హ్యాట్రిక్ కొట్టనుందని దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు.


నిర్మాత మాట్లాడుతూ... ఫస్ట్‌లుక్‌, ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోందని అన్నారు. పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, హారర్ టచ్‌తో అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇది తమ సంస్థలో మరో సూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందని తెలిపారు.


అల్లరి నరేష్ కెరీర్లోనే అతిపెద్ద రిలీజ్‌గా ఈ సినిమా నిలవనుందని చెప్తున్నారు. నరేష్ శైలిలో సాగే కామెడీకి తోడు ఈసారి హర్రర్ కూడా తోడవ్వడం ప్లస్ అని టీమ్ భావిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాకు మంచి అంచనాలను తీసుకొచ్చింది. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను విక్రమమార్కుడు, నాన్నకు ప్రేమతో వంటి భారీ సినిమాల నిర్మాత బీవీఎస్‍ఎన్ ప్రసాద్ నిర్మించారు.కృతిక, వౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్, ధన్‌రాజ్, ప్రగతి, రజిత, అమిత్, టార్జాన్, జయవాణి, అపూర్వ, ఆజాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: దాశరథి సివేంద్ర, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: డైమండ్ రత్నబాబు, పాటలు: భాస్కరభట్ల, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి.

English summary
The release date of Allari Naresh's 'Intlo Deyyam Nakem Bhayam' changed by a day. The movie will now be hitting the screens on 12th November. Earlier it was planned to release on 11th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu