»   » ఫాస్టెస్ట్ 100 కోట్లు గ్రాసర్ ‘ఖైదీ నెం 150’... అల్లు అరవింద్ ప్రకటన

ఫాస్టెస్ట్ 100 కోట్లు గ్రాసర్ ‘ఖైదీ నెం 150’... అల్లు అరవింద్ ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాసర్ 'ఖైదీ నెం 150' సినిమాయే అని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టిమరీ వెల్లడించారు. సినిమా బాక్సాఫీసు వద్ద తొలివారం పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రకటన చేసారు.

బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ... సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో సినిమాను ఆదరించి వారందరికీ కృతజ్ఞతలు, సినిమాకు పని చేసిన వారికి అభినందన తెలియాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. ఇందుకోసం కృతజ్ఞాభినందన సభ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. సినీ నిర్మాతలు ఈ సభలో పాల్గొంటారని, సభ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే విషయం త్వరలో వెల్లడిస్తామన్నారు.

ఫస్ట్ వీక్ 108 కోట్లు: వసూళ్ల వివరాలు ప్రకటించన అరవింద్

ఫస్ట్ వీక్ 108 కోట్లు: వసూళ్ల వివరాలు ప్రకటించన అరవింద్

ఖైదీ నెం 150 మూవీ ఫస్ట్ వీక్ రూ. 108.48 కోట్ల గ్రాస్ సాధించింది. టాలీవుడ్లో ఫాస్టెస్ట్‌గా రూ. 100 కోట్లు గ్రాస్ అందుకున్న సినిమా ఇదే. తెలుగు రాష్ట్రాల్లో రూ. 76 కోట్ల 15 లక్షల 4 వేలు, నార్త్ అమెరికాలో రూ. 17 కోట్లు, కర్నాటకలో 9 కోట్లు, ఒరిస్సాలో 40 లక్షలు, తమిళనాడులో 60 లక్షలు, రెస్టాఫ్ వరల్డ్ రూ. 3.90 కోట్లు, నార్త్ ఇండియా రూ. 1.43 కోట్లు వసూలు చేసిందని అరవింద్ తెలిపారు.

వినాయక్ బెస్ట్ అని ముందే డిసైడ్ అయ్యాం

వినాయక్ బెస్ట్ అని ముందే డిసైడ్ అయ్యాం

చిరంజీవి 150వ సినిమాకు ఏ దర్శకుడు అయితే బెస్ట్ అని పెద్దగా కసరత్తు ఏమీ చేయలేదు. వినాయక్ అని ముందే అంతా ఫిక్స్ అయ్యారు. చిరంజీవి రీ ఎంట్రీకి అభిమానులు, ప్రేక్షకలు నుండి ఘన స్వాగతం లభించింది అని అరవింద్ తెలిపారు.

ఈ ఏడాది నిజమైన సంక్రాంతి: వినాయక్

ఈ ఏడాది నిజమైన సంక్రాంతి: వినాయక్

ఈ ఏడాది నిజమైన సంక్రాంతి చేసుకున్నట్లు ఉంది. సినిమాను అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నా కెరీర్లో ఎంతో సంతోషాన్ని ఇచ్చిన సినిమా. సినిమా ఇంత పెద్ద విజయానికి చిరంజీవి గ్లామరే 51 శాతం పని చేసింది. ఈ చిత్రానికి కథ అందించిన మురుగదాస్ కు థాంక్స్ అన్నారు వినాయక్.

సినిమాకు అన్యాయం జరుగుతోందని ఫ్యాన్స్ బాధ పడొద్దు

సినిమాకు అన్యాయం జరుగుతోందని ఫ్యాన్స్ బాధ పడొద్దు

సినిమాకు అన్యాయం జరుగుతోందని ఫ్యాన్స్ బాధ పడొద్దు. కలెక్షన్ల వర్షం కురుస్తోంది. బాస్ ఈజ్ బ్యాక్ అని అభిమానులు చూపించారు.... అని వినాయక్ కామెంట్ చేసారు.

English summary
Megastar Chiranjeevi's 150th film was released last week across the world. The movie ran with packed houses across the world and has got a positive talk about Chiru's re-entry. Khaidi No 150 has set the new records in collections, by breaking all the previous records. Producer Allu Aravind said that this movie, Khaidi No 150 has become the highest 100cr grossed film on the first week, by collecting 108.48 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu