»   » పవన్ కళ్యాణ్ రికార్డ్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్ రికార్డ్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్సును ఆకర్షించడంలో దర్శకుడు త్రివిక్రమ్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఓవర్సీస్ ప్రీమియర్ షో వసూళ్ల విషయంలో ఈ చిత్రం పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం వసూళ్లను బీట్ చేసిందని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నమాట. యూఎస్ఏలో ఈ చిత్రం ఇప్పటికే 1 మిలియన్ డాలర్ మార్కను దాటేసింది. యూఎస్ఏలో 1 మిలియన్ మార్కు దాటిన బన్నీ రెండో చిత్రం ఇది. బన్నీ గత చిత్రం జులాయి కూడా ఇక్కడ 1 మిలియన్ మార్కును క్రాస్ అయింది.

Allu Arjun breaks Pawan Kalyan records

సన్నాఫ్ సత్యమూర్తి యూఎస్ఏ కలెక్షన్ రిపోర్టు ఇలా ఉంది....

బుధవారం(ప్రీమియర్ షో): $345000
గురువారం: $ 138000
శుక్రవారం: $ 249000
శనివారం: $ 278000
మొత్తం: $ 1,010,000

'S/O సత్యమూర్తి' చిత్రంలో అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు నటించారు. సాంకేతిక వర్గం పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

English summary
Allu Arjun's S/O Satyamurthy breaks Pawan Kalyan's Attarintiki Daredi overseas collections records.
Please Wait while comments are loading...